కేంద్రం : విద్యుత్ సంక్షోభం.. ఒట్టిమాటే.. !

సామజిక మాధ్యమాల విస్తరణ తరువాత వార్తలలో అనేకానేక మార్పులు వస్తున్నాయి. ఏది నిజం ఏది అబద్దం కూడా తెలియనంతగా వార్తలు పుట్టుకొస్తున్నాయి. దీనితో సామాన్యుడికి దేనిని నమ్మాలో తెలియని స్థితికి వచ్చేస్తున్నాడు. అయితే మంచికంటే చెడుకే నోరెక్కువ అన్నట్టుగా అర్ధం లేని లేదా సంబంధం లేని లేదా ఫేక్ వార్తలు మాత్రమే ఈ ప్రచారంలో ముందు ఉంటున్నాయి. ఇలాంటి ప్రచారంపై కేంద్రం సహా పలు దేశాలు కూడా కొరడా జులుపుతున్నాయి. అయినా వాటి వేగం మాత్రం ఆగటం లేదు. ఈ వార్తలు సినిమా వార్తలకు మాత్రమే పరిమితం కావటంలేదు, రాజకీయ, సామజిక, వైద్య సహా ఏది ప్రజలకు అత్యవసరం ఉందో అదే ఈ తరహా ఫేక్ వార్తా ప్రచారంలో ఉంటున్నాయి.
అత్యవసర వార్తలను కూడా ఈ తరహా ఫేక్ వార్తలుగా మర్చి ప్రచారం చేయడం పై ఆయా సంస్థలు లేదా ప్రభుత్వాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సార్లు ప్రభుత్వాలను కూలగొట్టడానికి కూడా ఈ తరహా ప్రచారాలు బాగా వాడుకుంటున్నారు. నేడు ఇది కూడా రాజకీయ నేతలకు ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. అందుకే అప్పట్లో ఫేస్ బుక్ లాంటి సామజిక మాధ్యమాల పై ఆంక్షలు, విమర్శలు వచ్చాయి. ఒక్కసారి ఇలాంటి ప్రచారం జరిగితే దానిని ఆయా ప్రభుత్వాలు నిజం కాదని చెప్పడానికి తలప్రాణం తోకకు వస్తుంది. అంతలా ఈ ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా దేశంలో బొగ్గు సంక్షోభం ఉందని ప్రచారం జరుగుతుంది. దానివలన అతిత్వరలో విద్యుత్ సంక్షోభం కూడా వస్తుందని ఈ వార్తల రూపంలో ప్రచారం చేస్తున్నారు.
ఈ విధంగా ప్రచారం చేయడం వలన కేంద్రప్రభుత్వానికి కొత్త సమస్యలు వస్తున్నాయి.. అసలు అయితే భారత్ లో బొగ్గు సంక్షోభం ఉన్నప్పటికీ ఆయా దేశాల నుండి భారీగా దిగుమతి చేసుకుంటుంది. దానిని కూడా అదేదో వింత అన్నట్టుగా ఇష్టానికి దుష్ప్రచారం చేయడం కొందరికి అలవాటు అయిపోయింది. దీనివలన భారత ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కొన్ని శత్రుదేశాలతో కలిసిన విపక్షాలు అర్ధం లేని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే ఈ తరహా ప్రచారాలు చేస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు. దీనికోసం వాళ్ళు ఈ తరహా వార్తలనే కాకుండా రైతు ఉద్యమాలను కూడా వాడుకుంటున్నట్టు ఇప్పటికే నిఘా సంస్థలు హెచ్చరించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: