బుల్లిపిట్ట: షుగర్ పేషెంట్లకు ఒక శుభవార్త.. ఇకమీదట..?
అయితే తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు వారి పరిశోధనలో ఒక డివైజ్ ను కనుగొన్నారు. ఆ డివైస్ తో ఎలాంటి రక్తం అవసరం లేకుండ మనకు షుగర్ ఉందో లేదో తెలియజేస్తోంది. అది ఎలాగంటే కేవలం మన శరీరం పైన వచ్చేటువంటి చెమట ఆధారంగా.. దేహం ఉండేటువంటి చక్కెర స్థాయిలను చూపిస్తుందట. ఈ పరికరాన్ని మనం చేతితో తాకవచ్చు.
ఈ పరికరాన్ని ఎక్కడైనా చేతిమీద ఉంచుకొని మన షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకోవచ్చు. అమెరికాలోని పెన్సిల్వేనియా అనే యూనివర్సిటీ లోని కొంతమంది పరిశోధకులు దీనిని పరిశీలించి సమాచారాన్ని తెలియజేశారు. దీనిని బయో సెన్సార్, బయో ఎలక్ట్రానిక్ వంటివాటితో నిర్మించారు. ఇక ఈ డివైస్ లో నికెల్ అనే మెటల్ ను ఉంచడంవల్ల, సులువుగా మన శరీరంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని తెలియజేస్తుంది.
ఇక ఈ డివైస్ చేసేటప్పుడు బంగారాన్ని కూడా కొద్దిగా వినియోగించారట. వీటి కారణంగానే ఎవరికైనా అలర్జీ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని తెలియజేస్తున్నారు పరిశోధకులు. ఈ డివైజ్స్ రక్తం తో పోలిస్తే.. చెమటలోనే గ్లూకోజ్ శాతాన్ని బాగా కరెక్ట్ గా చూపిస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ డివైస్ లో ఎంజైమ్లు వంటి వాటిని ఉపయోగించకపోవడం వల్ల చర్మం దెబ్బతినకుండా ఉంటుందని, చెప్పుకొస్తున్నారు పరిశోధకులు. దీనిని త్వరలోనే దేశమంతటా విస్తృతంగా చేస్తాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అందుకు వైద్య ఆరోగ్య సహకారం అందించాలని చెప్పుకొస్తున్నారు పరిశోధకులు.