బుల్లి పిట్ట: 50 ఇంచేస్ స్మార్ట్ టీవీ..కేవలం రూ.30 వేల లోపే..!!
స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ , స్మార్ట్ ఫ్రిడ్జ్ ఇలా ఏదైనా సరే అత్యధిక ధర తో కూడుకున్న వాటిని కొనుగోలు చేయాలంటే, ఎవరైనా సరే ఆఫర్ లు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది.. కాబట్టి మంచి మంచి ఆఫర్లు కూడా మీకు లభిస్తున్నాయి. అందులో భాగంగానే రెడ్మీ 50 అంగుళాల ఫోర్ కె అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ టీవీ ని మీరు కేవలం రూ. 30 వేలు లోపు సొంతం చేసుకోవచ్చు..
ఇకపోతే రెడ్మీ 50 అంగుళాల ఫోర్ కె అల్ట్రా హెచ్డి ఆండ్రాయిడ్ టీవీ అసలు ధర రూ.32,999 కాగా.. కూపన్ ద్వారా రూ.1000 తగ్గింపుతో పొందవచ్చు.. అలాగే బ్యాంక్ ఆఫర్ తో కూడా కలిపి రూ.28,999 ధరకే లభిస్తుంది. మీరు ఈ 50 అడుగుల ఫోర్ కె అల్ట్రా హెచ్డి ఆండ్రాయిడ్ టీవీ నీ అమెజాన్ లో పొందవచ్చు. ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ని కొన్నవారికి రూ.4,999 విలువ కలిగిన ఈకో డాట్ థర్డ్ జనరేషన్ కేవలం రూ.499 కే పొందవచ్చు. నవంబర్ 2 వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది కాబట్టి వెంటనే త్వరపడండి.