బుల్లి పిట్ట:మైలేజ్ 80..ధర 40..ఎలక్ట్రిక్ బైక్..?

Divya
 ప్రతిరోజు పెట్రోల్ ధర పెరిగిపోతూనే ఉంది.అందువల్లనే ఎలక్ట్రిక్ వాహనాల కు ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. అందరూ కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే మార్కెట్లోకి కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలయ్యాయి. ఇక తాజాగా ప్రముఖ సంస్థ అయినటువంటి ఓకాయా పవర్ గ్రూప్ ఎలక్ట్రిక్ సంస్థ టూవీలర్ రంగంలోకి కూడా తన మార్కెట్ ను ప్రవేశపెడుతోంది. అందుకు సంబంధించి ఒక ఎలక్ట్రిక్ బైక్ ను కూడా విడుదల చేస్తోంది.. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

ఓకాయా కంపెనీ నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ బైక్ ధర 39,999 రూపాయలకే మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ బైక్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 80 కిలోమీటర్ల వరకు రాగలదు. ఈ సంస్థ ఇప్పటికే 18 రాష్ట్రాలలో 170 మంది డీలర్లతో అగ్రిమెంటు రాసుకున్నది. అంతే కాదు ఈ సంస్ధ ఈ బైక్ ను తయారు చేసేటువంటి కర్మగారాన్ని హిమాచల్ ప్రదేశ్ లో ఏర్పాటు చేసింది.
ఇక అంతే కాకుండా హర్యానా, రాజస్థాన్ వంటి ప్రదేశాలలో కూడా మరొక మూడు ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇది  2025 నాటికి పూర్తి అవనున్నట్లుగా తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసినట్లుగా తెలిపింది. ఇక వీటికి సంబంధించి బైక్ ని దసరా పండుగ సందర్భంగా ప్రారంభించింది. దేశంలోని నలుమూలల నుంచి మంచి స్పందన రావడంతో.. ఎలక్ట్రిక్ బైక్ ను భారత్లో కూడా విస్తరింప చేయాలని చూస్తోంది.
ఇండియాలో పాటుగా విదేశాలలో సైతం వీటిని ఏర్పాటు చేసేందుకు 2 సెంటర్లను ప్రత్యేకంగా ఉంచుతాం అని తెలిపింది. ముఖ్యంగా ఈ బైకు నడిపేందుకు ఎటువంటి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఉండేలా ఈ బైక్ ను తయారు చేసింది. ఓకాయా పవర్ గ్రూప్ సంస్థ 42 సంవత్సరాలుగా బ్యాటరీ రంగంలో రాణి స్తోంది. బ్యాటరీ తయారీ పరిశ్రమలలో కూడా మొదటి స్థానంలో పేరు సంపాదించుకుంది. అందుచేతనే ఎలక్ట్రిక్ బైక్ వైపు తమ అడుగులు వేసారు అని చెప్పుకొచ్చారు ఆ సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: