ఎవరైనా సరే
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తున్నారు అంటే.. ముందుగా
ఫోన్ యొక్క బ్యాటరీ బ్యాకప్ , ధర, కెమెరా, స్టోరేజ్ వంటి కొన్ని విషయాలను ముఖ్యంగా చూస్తారు అనే విషయం తెలిసిందే.. అయితే ప్రతి ఒక్కరికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వేధించే సమస్య ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. ఎంతసేపు చార్జింగ్ పెట్టినా సరే చార్జింగ్ త్వరగా అయిపోతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి..అందుకే చాలామంది ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే
స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక మీరు కూడా బ్యాటరీ కెపాసిటీ ఉన్న
స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నట్లు అయితే 6000 ఎమ్ ఏ హెచ్ బ్యాటరీ కెపాసిటీ తో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
1. రెడ్మి 10 ప్రైమ్:
ఈ
స్మార్ట్ ఫోన్ మనకు 6000mah భారీ బ్యాటరీ ని కలిగి ఉంది.. 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే వంటి ఫీచర్స్ తో పాటు 4GB ర్యామ్, 64 GB వేరియంట్ ధర రూ.12,499 అయితే 6GB ర్యామ్, 128 GB వేరియంట్ వున్న
స్మార్ట్ ఫోన్ ధర రూ.14,499 కి లభించనుంది.
2. సాంసంగ్ గాలక్సీ M32 :
ఈ మొబైల్ కూడా మీకు 6000 ఎమ్ ఏ హెచ్ బ్యాటరీ తో లభిస్తుంది. 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్ డి డిస్ప్లే కలిగిన ఈ
ఫోన్ 4GB ర్యామ్, 64 GB వేరియంట్ ధర రూ.14,999 అయితే 6GB ర్యామ్, 128 GB వేరియంట్ వున్న
స్మార్ట్ ఫోన్ ధర రూ.16,999 కి లభించనుంది.
ఇక వీటితో పాటు సాంసంగ్ గాలక్సీ ఎఫ్ 12, పోకోM3, మోటో జీ40 ఫ్యూజన్, రియల్ మీ నార్జో 50A ,
నోకియా C30 వంటి స్మార్ట్ ఫోన్స్ 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ తో మనకు లభించనున్నాయి.