వేప చెట్టు ఎందుకు ఎండుతుందో తెలిస్తే షాక్ అవుతారు..!

MOHAN BABU
తెలుగు రాష్ట్రాల్లో వేపకు వింత రోగం వచ్చింది. పచ్చని వృక్షం మలమలమాడిపోతోంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న చెట్టు నిలువునా కూలిపోతుంది. కళ్లముందే చెట్లన్నీ మోడుబారి పోతుంటే జనం ఆందోళన చెందుతున్నారు. జీవాయుధం లాంటి వేపకు ఇలాంటి పరిస్థితి ఎందుకచ్చిందా అని  భయపడిపోతున్నారు. వేప చెట్లు ఎండిపోవడం అరిష్టమా? పర్యావరణ వైపరీత్యమా..? వేప చెట్టు తో మనకున్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఊళ్లళ్ళో వేపపుల్ల తో పళ్ళు తోముకోకుండా దినచర్య మొదలు కాదు. ఆయుర్వేదంలో వేపాకు, పూత, బెరడుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలా మందుల్లో ముఖ్యంగా డయాబెటిస్ నివారణలో వేపను వినియోగిస్తారు.

పండుగలకు,పూజలకు వేప కొమ్మలను గుమ్మానికి కట్టడం ఆచారం. ఇంట్లో దోమలను తారిమేసేందుకు వేపాకు పొగ వేస్తారు. పంటల మీద చీడపీడలను వదిలీంచేందుకు వేపాకు రసాన్ని పిచికారీ చేస్తారు. వేప తో చేసే సబ్బులు, పేస్టులు,క్రిములకు మంచి గిరాకీ ఉంది. సైంటిఫిక్ గా చెప్పాలంటే వేప యాంటీబ్యాక్టీరియల్, యాంటీ పారాసెటిక్, యాంటీ ఇన్ఫ్లమేంటరీ, యాంటీ ఫంగల్ చాలామందులు,సౌందర్య ఉత్పత్తుల్లో వేపకు చోటుకల్పించారు. ఎన్నో ఔషధ గుణాలున్న వేప కే ఇప్పుడు ఆపద వచ్చింది. మొదట చెట్టు కొనలు కాలి పోయినట్లు మారి  క్రమంగా మోడుబారిపోతున్నాయి . హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి,నల్గొండ, మహబూబ్ నగర్, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో చెట్లన్నీ నిర్జీవంగా మారిపోతున్నాయి . ఏ గ్రామంలో ఎక్కడ చూసినా అకస్మాత్తుగా చెట్ల లేటు చిగుళ్ల నుంచి కొమ్మల వరకు మాడిపోతున్నాయి.కొన్ని చోట్ల వేప చెట్లు వాటి ఆకులు, కొమ్మలు ఎండిపోయి  పసుపు, గోధుమ రంగులోకి మారతూ క్షినిస్తున్నాయి. మామూలు చెట్టు అయితే గాలి పాటుకు ఏదో అయిందని అనుకోవచ్చు. కానీ వేప విషయంలో అలా అనుకోవడానికి లేదు. చీడపీడల కు విరుగుడు గా ఉపయోగపడే వేప వృక్షాలే ఇలా ఎందుకు తెగుళ్ల బారిన పడుతున్నాయి..? తెలంగాణలో హరితహారం, ఆంధ్రప్రదేశ్లో వనం మనం కార్యక్రమం కింద నాటిన మొక్కలన్ని ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చినవే. అవన్నీ కర్ణాటక, గోవా, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి తెచ్చినవే కావడంతో ఆయా ప్రాంతాల నుంచి వ్యాధి కారకాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది అక్కడే గమనించి నిరోధిస్తే  పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నా వాదనలు కూడా ఉన్నాయి.

వేప చెట్ల పై బాగ్స్ నివారణ సాధ్యమేనంటున్నారు సైంటిస్టులు. చీడ ఆశించిన వేపచెట్టు కొమ్మల్ని వెంటనే నరికి బాబిస్టిన్ ను పిచికారి చేయాలని లేదంటే గోరింటాకు ముద్దగా చేసి నరికిన కొమ్మలకు అంటించాలని చెబుతున్నారు. ఫారెస్ట్,హార్టికల్చర్ , అగ్రికల్చర్ ఆఫీసర్లు సమన్వయంతో పనిచేస్తే తెగులు ఉధృతిని తగ్గించవచ్చని సూచిస్తున్నారు. ఏదేమైనా ఏడాదిలోగా ఈ తెగులు కు ముగింపు పలకాల్సిందే నని  అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: