బుల్లి పిట్ట: సులువుగా ఆధార్ నెంబర్ తో ఇలా డబ్బులు పంపించండి..!!
ఎవరైతే స్మార్ట్ ఫోన్ , యు పి ఐ ఐడి లేనివారు ఆధార్ నంబర్ ను ఉపయోగించి డబ్బులను బదిలీ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ తో పాటు పేరు ద్వారా డబ్బులను పంపుకోవచ్చు. ఇక అందుకోసమే యూపీఐ యాప్ ను తీసుకొచ్చారు. సాధారణంగా మనం డబ్బులు పంపించాలి అంటే మొబైల్ నెంబర్ ద్వారా లింక్ అయిన బ్యాంకు అకౌంట్ కు మాత్రమే డబ్బులు పంపించుకునే వెసలుబాటు ఉండేది.. అయితే ఇప్పుడు భీం లోని లబ్ధిదారుల అడ్రస్ లో ఉండే ఆధార్ నెంబర్ ద్వారా కూడా ఇతరులకు డబ్బులను పంపించవచ్చు.
ఇందుకోసం మీరు యూపీఐ యాప్ డౌన్లోడ్ చేసుకొని.. భీమ్ లో ఆధార్ నంబర్ ను నమోదు చేయాలి. లబ్దిదారుని యొక్క 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై బటన్ పై క్లిక్ చేయాలి. ఆధార్ లింకింగ్ , లబ్దిదారుల అడ్రస్ వెరిఫై ఇలా ప్రతి ఒక్కటి వెరిఫై చేసిన తర్వాత..UIDAI సమాచారం ప్రకారం మీరు లబ్ధిదారుల అకౌంట్లో యూజర్లు నగదును పంపించవచ్చు. అంతేకాదు పేమెంట్ లను స్వీకరించడానికి ఆధార్ పే pos లు ఉపయోగించే వ్యాపారులకు డిజిటల్ పేమెంట్ లు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫింగర్ప్రింట్, ఆధార్ నెంబర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.