బుల్లి పిట్ట: హెలికాప్టర్ లో ఉపయోగించే బ్లాక్ బాక్స్ వల్ల ఉపయోగం ఏమిటో తెలుసా..?

Divya
నిన్నటి రోజున ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ తన భార్యతో సహా మరణించడం జరిగింది. ఇక వీరితో పాటు మొత్తం 13 మంది మరణించినట్లుగా గుర్తించారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియడం లేదు. అయితే హెలికాప్టర్ లో ఎలాంటి ప్రమాదం జరిగింది అనే విషయం తెలియాలంటే.. ఆ హెలికాప్టర్ లో ఉన్న బ్లాక్ బాక్స్ ను డి కోడ్ చేయాలని ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇంతకీ ఆ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

బ్లాక్ బాక్స్ మొత్తం 13 గంటల వ్యవధిలో ఎలాంటి విషయం జరిగినా ఆ హెలికాప్టర్ లకు సంబంధించి మొత్తం డేటా ఉంటుందట. హెలికాప్టర్ ప్రమాదానికి ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే మొత్తం సమాచారాన్ని ఈ బ్లాక్ బాక్స్ తెలుపుతుందట. ఇక ప్రమాదానికి ముందు అక్కడ సంభాషణలు ఏమన్నా జరిగాయా అనే విషయం కూడా రికార్డు అయి ఉంటుందట. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఇది కూడా కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాంటిదే.

ఈ బ్లాక్ బాక్స్ చాలా ఖరీదైనది, ఈ బ్లాక్ బాక్స్ ను చాలా దృఢమైన పదార్థంతో తయారు చేస్తారు. ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా అందులో ఉండే డేటా భద్రంగానే ఉంటుందట. రాడార్ సిగ్నల్ వంటివి అందక పోయినప్పటికీ ఆ బ్లాక్ బాక్స్ మాత్రం పని చేస్తూనే ఉంటుందట. ఈ బాక్స్ ను గుర్తించేందుకు సులువుగా ఉండాలని ఆ బాక్స్ కి ఆరెంజ్ కలర్ పూత పూస్తారట.

ఈ బ్లాక్ బాక్స్ వల్లనే బిపిన్ రావత్ సింగ్ మరణానికి సంబంధించి కొన్ని విషయాలు తెలిసినట్లు సమాచారం. ప్రమాదం జరిగే కొన్ని నిమిషాల ముందు.. ఆ ఎలికాప్టర్ కి కంట్రోల్ రూమ్ కి మధ్య బంధం తెగిపోయినట్లు గా తెలుస్తోంది. ఇంకా మరెన్నో విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలియజేశారు. ఈ బ్లాక్ బాక్స్ ఎందుకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: