బుల్లిపిట్ట: రూ.500 కే రియల్ మీ 8s5G స్మార్ట్ ఫోన్..!!
రియల్ మీ 8s స్టోరేజ్ వేరియంట్ విషయానికొస్తే 8gb రామ్, 128gb స్టోరేజ్ వేరియంట్ తో లభిస్తున్న ఈ ఫోన్ ధర మార్కెట్ రేట్ ప్రకారం రూ.22,999 . కానీ ఫ్లిప్ కార్ట్ ఈ మొబైల్ ఫోన్ పై 13 శాతం డిస్కౌంట్ తో మనకు రూ.19,999 కే అందిస్తోంది. 13 శాతం డిస్కౌంట్ అంటే మనకు ఏకంగా రూ.మూడు వేల తగ్గింపుతో ఎవరైనా సరే ఈ మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది ఫ్లిప్ కార్ట్. అంతేకాదు ఈ డిస్కౌంట్ తో పాటు మనకు ఇంకా కొన్ని డిస్కౌంట్లు కూడా ఈ ఫోన్ పై అందుబాటులో ఉండటం గమనార్హం.
అలాగే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించి కూడా ఈ ఫోన్ మీరు రెండు వేల రూపాయల అదనపు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ తాజాగా ప్రకటించింది. అంటే రూ.17,999 కే మీరు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సహాయంతో ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ఆశ్చర్యపోయే మరొక విషయం ఏమిటంటే ఈ ఫోనే కనుక మనము ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే రూ.17,450 భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు మీ స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఈ ఆఫర్ ను త్వరగా అందుకోవచ్చు. అయితే మీరు ఈ ఆఫర్ పొందాలి అంటే ఫోన్ యొక్క కండిషన్ , మోడల్ ఆధారంగా ఎక్స్చేంజ్ కూడా ఆధారపడి ఉంటుంది. అలా అన్ని ఆఫర్స్ పూర్తిగా అప్లై చేసుకున్నట్లయితే ఈ ఫోన్ మీకు కేవలం 549 రూపాయలకే సొంతం కావడం గమనార్హం.