ఈ రోజుల్లో విద్యార్థులు చాలా చురుగ్గా ఉన్నారు. ఒక విషయం గురించి చెబితే దానిని పూర్తిగా అందరికి అర్థమైయ్యెలా చెప్పడం చెస్తున్నారు. ఎన్నెన్నో కొత్త ప్రయొగాలను చెస్తున్నారు. ముఖ్యంగా కొత్త టెక్నాలజీ ని ప్రజల వద్దకు తీసుకెల్లాలని తెగ ఉత్సాహపడి ప్రయోగాలు చెస్తున్నారు. అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని మాత్రం జనాలకు షాక్ ఇచ్చేలా ఔరా అనిపిస్తున్నాయి.. అలాంటి వాటిలో ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది. అందరినీ ఆష్చర్యానికి గురి చెసెలా ఒక బైక్ ను ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించారు. అది ఇప్పుడు ఆ నోటా ఈ నోటా వినిపిస్తోంది.
అ బైక్ కేవలం 15 రుపాయల ఖర్చుతో 45 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు అని అంటున్నారు.. ఆ బైక్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ బైక్ పేరు రెట్రోఫిట్ ఎలక్ట్రిక్ బైక్.. పేరు వినడానికి కొత్తగా ఉన్న ఇది నిజం అని చెప్పాలి. అన్నీ బైక్ ల మాదిరిగా కాకుండా ఇందులో రివర్స్ సదుపాయం కూడా ఉండటం విశేషం.. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. అంతేకాదు గంటకు 60 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు అని విద్యార్థులు అంటున్నారు. బైక్ మొత్తం ప్రత్యేకతలను ఒకసారి చూద్దాం..
పాత బైక్‌కు లిథియమ్ అయాన్ బ్యాటరీని అమర్చి, వెనుక చక్రానికి మోటార్ బిగించడం ద్వారా వాహనం ముందుకు నడిచేలా తయారు చేశారు. ఈ బైక్ కోసం రెండు నెలలు కష్టపడ్డారని చెబుతున్నారు..ఎటువంటి కాలుష్యాలు లేని విధంగా దీన్ని డిజైన్ చేశారు. పోర్టబుల్ బ్యాటరీ మెకానిజమ్ డిజైన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. గంటకు 60 కిలో మీటర్లు వేగంతో ప్రయాణం చెస్తుంది. అంతేకాదు ఈ బైక్ ఫుల్ చార్జ్ అవ్వడానికి రెండున్నర గంటలు పడుతుంది..15 మాత్రమే ఖర్చవుతుంది. ఒకసారి చార్జింగ్‌తో సుమారు 45 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు..ఇద్దరు వ్యక్తులకు సౌకర్యం గా వుంటుంది.