AIRTEL కస్టమర్స్ కి భారీ షాక్... ఆగిపోయిన సర్వీసులు?
ఇది ఒక్క ఎయిర్టెల్ మొబైల్ ఇంటర్నెట్ సమస్య మాత్రమే కాదు బ్రాడ్ బ్యాండ్, వైఫై వంటి మిగిలిన ఎయిర్టెల్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. అంతే కాకుండా ఎయిర్టెల్ యాప్ కూడా హ్యాంగ్ అవ్వడంతో సమస్య పెద్దదిగా మారింది. దేశంలోని ఎయిర్టెల్ కస్టమర్లు ఇప్పటికే కంపెనీ పై ఓ వైపు విమర్శలు మరో వైపు ప్రశ్నలు కురిపిస్తున్నారు. కొందరు కస్టమర్లు అయితే ఇదే విషయం గురించి సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నెలలో ఇలా ఎయిర్టెల్ సేవలకు అంతరాయం కలగడం రెండవ సారి కావడంతో కస్సుమంటూ కోపంతో ఊగిపోతున్నారు.
దాంతో కస్టమర్ల ఫిర్యాదులకు స్పందించిన ఎయిర్టెల్ కంపెనీ ఈ విధంగా వివరాలు తెలియ చేసింది. కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాము వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి ఎయిర్టెల్ సేవలను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. అయితే ఇది ఇలాగే కొనసాగితే జియో ఏళ్లతరబడి ఎయిర్టెల్ తో కొనసాగిన కోట్ల మంది కస్టమర్లు మారిపోయే అవకాశం ఉంది. మరి ముందు ముందు అయినా సేవలను పునరిద్ధరిస్తారేమో చూడాలి. అయితే గత కొంత కాలం నుండి ఎయిర్టెల్ నెట్వర్క్ సిస్టం లో సమస్యలు ఉన్న విషయం వాస్తవమే అయినా ఎందుకు ఇప్పటికీ పరిష్కారం కాలేదు అనేది ఎయిర్టెల్ యాజమాన్యం చెప్పాల్సిన అవసరం ఉంది.