వారెవ్వా.. హైదరాబాదులో డ్రైవ్ ఇన్ థియేటర్స్?
ఆ రేంజ్ లో భాగ్యనగరంలో రూపురేఖలు మొత్తం మారిపోయాయి. అంతేకాదు ఇక ప్రజల ఆలోచనలు మారుతున్న కల్చర్ కు తగ్గట్లు గా ఎన్నో మార్పులు కూడా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక నేటి రోజుల్లో ట్రెండ్‌కు తగ్గట్టు గానే అటు జిహెచ్ఎంసి అధికారులు కూడా హైదరాబాదులో వినూత్నమైన నిర్మాణాలు చేపడుతూ ఉండటం గమనార్హం. కరోనా వైరస్ కి ముందు ప్రజలు సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. కానీ ఆ తర్వాత మాత్రం చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు సినిమా థియేటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చొని హాయిగా ఓటిటీలో కావాల్సిన సినిమా చూసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో డ్రైవ్ ఇన్ థియేటర్స్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.
డ్రైవ్ ఇన్ థియేటర్స్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హెచ్ఎండీఏ ప్రస్తుతం ప్రణాళికలను సిద్ధం చేస్తోందట. ఈ క్రమంలోనే హాయిగా మన కార్లోనే కూర్చుని ఇక సినిమా చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇక దీని కోసం నగరం మధ్యలో స్థలం దొరకటం నేటి రోజుల్లో ఎంతో కష్టం.. అందుకే అవుటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో స్థలం కోసం హెచ్ఎండీఏ అన్వేషణ ప్రారంభించింది అన్నది తెలుస్తుంది. ఇక డ్రైవ్ ఇన్ థియేటర్స్ కోసం సుమారు ఐదు నుంచి ఎనిమిది కోట్ల వరకూ ఖర్చు అయ్యే అవకాశం ఉందట. అయితే ఇప్పటికే దేశంలో ఉన్న ప్రముఖ నగరాల్లో ఇలాంటి డ్రైవ్ ఇన్ థియేటర్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇక ఇప్పుడు భాగ్యనగరంలో కూడా ఈ సరికొత్త థియేటర్లను అందుబాటులోకి తీసుకురావాలని హెచ్ఎండీఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది..