బుల్లిపిట్ట: ఈ స్మార్ట్ టీవీ ఉంటే చాలు థియేటర్లకు వెళ్లాల్సిన పనిలేదు..!!
ఇక ఈ టీవీ ధర ప్రస్తుతం 19,900 యువాన్ లు గా నిర్ణయించారు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.2,39,500.. ఇకపోతే బ్లాక్ కలర్ ఆప్షన్లో దీనిని కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే చైనాలో దీనికి సంబంధించి ప్రీ బుకింగ్ ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.. రెడ్మీ మాక్స్ 86 అంగుళాల మ్యాక్స్ టీవీ చైనాలో 7,999 యువాన్ కాగా పోయిన సంవత్సరం లాంచ్ చేశారు . ఇక భారత కరెన్సీ ప్రకారం 95,700 రూపాయలు.
రెడ్మీ మాక్స్ 100 ఇంచెస్ టీవీ స్పెసిఫికేషన్ అలాగే ఫీచర్ విషయానికొస్తే.. 4GB ర్యామ్ , 64GB స్టోరేజ్ తో వీటిని అందుబాటులోకి ఉంచారు. డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మాస్ఫియర్ సపోర్ట్ లతోపాటు వైఫై సిక్స్, 30 watt స్పీకర్స్, రెండు యూఎస్బీ పోర్టులు, 1 ఎథర్ నెట్ పోర్టు కూడా ఇందులో కల్పించడం గమనార్హం. ఎం ఐ యు ఐ టీవీ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది అని కంపెనీ తెలిపింది.