ఈ ఏడాది నుంచి BSNL 4G సేవలు!

తమ 4జీ సేవలు ఈ ఏడాదే (2022) స్టార్ట్ అవుతాయని ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం bsnl ప్రకటించింది.ఇక దీనికి సంబంధించిన టెక్నాలజీ ఇంకా అలాగే యంత్రాల సరఫరా కాంట్రాక్టును త్వరలోనే ఖరారు చేస్తామని కంపెనీ సీఎండీ పీకే పుర్వార్‌ చెప్పారు. ప్రైవేట్‌ కంపెనీలు 5జీ సేవలు స్టార్ట్ చేసిన bsnl కి ఢోకా ఉండకపోవచ్చన్నారు. మెరుగైన 4జీ సేవల ద్వారా తమ ఖాతాదారులను కాపాడుకుంటామన్నారు. ప్రైవేట్‌ కంపెనీలు 5జీ సేవలు స్టార్ట్ చేసిన,ఇక అందుకు అవసరమైన మొబైల్‌ ఫోన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కొంత టైం పడుతుందన్నారు.ఇక గత ఆర్థిక సంవత్సరం (2020-21) రూ.17,452 కోట్లు ఉన్న bsnl ఆదాయం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) రూ.17,000 కోట్లకు మించక పోవచ్చని పుర్వర్‌ తెలిపారు. ప్రభుత్వం ఇంటర్‌ కనెక్షన్‌ చార్జీలు ఎత్తివేయడం ఇందుకు ప్రదాన కారణమని ఆయన అన్నారు.



దీని నష్టాలు మాత్రం గత ఆర్థిక సంవత్సరంలో ఉన్నట్లుగానే రూ.7,441 కోట్ల స్థాయిలోనే ఉంటాయని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.VRS తో bsnl నిర్వహణ ఖర్చులు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గాయని ఆయన తెలిపారు.ఇక అలాగే మరోవైపు భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ (బీబీఎన్‌ఎల్‌) కంపెనీని బీఎస్ఎన్‌ఎల్‌లో విలీనం చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే విధానపరమైన డెసిషన్ తీసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఇక అధికారికంగా ఈ నెల్లోనే ఈ విషయం ప్రకటిస్తారని సమాచారం తెలుస్తుంది. ఇటీవల bsnl ఉద్యోగులు నిర్వహించిన ఒక సదస్సుల్లో bsnl సీఎండీ పుర్వర్‌ కూడా ఈ విషయం ఉద్యోగులకు తెలిపినట్టు సమాచారం తెలుస్తుంది.నిజానికి మిగిలిన నెట్ వర్క్ లతో పోలిస్తే bsnl చాలా బెస్ట్ నెట్ వర్క్ అని చెప్పాలి. ఎందుకంటే ఎయిర్టెల్, జియో, ఐడియా వోడాఫోన్ లాంటి నెట్ వర్క్ లు సామాన్యులకు రేట్లు పెంచి షాక్ ని ఇస్తున్నాయి. కాబట్టి వాటితో పోల్చుకుంటే రేట్ల విషయంలో ఈ bsnl వాటి కంటే చాలా వరకు బెస్ట్ నెట్ వర్క్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: