బుల్లి పిట్ట: అతి తక్కువ ధరకే రియల్మీ వాషింగ్ మిషన్..!!

Divya
ఇంతవరకు రియల్మీ బ్రాండెడ్ నుంచి మొబైల్స్, స్మార్ట్ వాచెస్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా రావడం మనం చూసే వున్నాం. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ బ్రాండెడ్ కలిగిన రియల్ మీ తన టెక్స్టైల్ రేంజ్ లో ఒక ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ని విడుదల చేసింది. వీటిలో సెమీ ఆటోమేటిక్ మిషన్ ను కూడా తీసుకు వచ్చింది. దీంతో మొదటిసారిగా రియల్మీ వాషింగ్ మిషన్ ల వైపుగా తన అడుగులను వేసింది. ఈ కొత్త సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లు..8,8.5 కేజీల బరువు లో అందుబాటులో ఉన్నాయట.

ఇక వీటి ధర విషయానికి వస్తే.. రూ.10,990 రూపాయల నుండి ప్రారంభం అవుతుందట. సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో ఎక్కువ కెపాసిటీని అమర్చారు. ఇక ఇందులో జెట్ డ్రీమ్ టెక్నాలజీ కూడా  అమర్చడం జరిగిందట. ఇక అంతే కాకుండా ఫైవ్ స్టార్ రేటింగ్ ను కూడా కలిగి ఉన్నది ఈ వాషింగ్ మిషన్. ఇది భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినట్లు కంపెనీ సంస్థ తెలియజేసింది. ఇందులో 1,400 RMP స్పిన్ సైకిల్, ఎయిర్ డ్రైవ్ టెక్నాలజీ కూడా కలదు.
ఇక అంతే కాకుండా హార్డ్ వాటర్, వాస్ కాలర్ స్క్రబ్ వంటి సదుపాయాలు కూడా కలవు. ఇక వాషింగ్ మిషన్ చుట్టూ బాడీ ని DURABLE ప్లాస్టిక్ తో తయారు చేయబడినదట. కాబట్టి తుప్పు పట్టడానికి వీలుండదని తెలియజేయడం జరిగింది. ఇందులో హెవీ డ్యూటీ మోటార్ ను కూడా అందించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇక వీటితో పాటుగా రియల్ మీ GT-2 PRO,4K స్మార్ట్ టీవీలు కూడా మన దేశంలో ఏప్రిల్ 7వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఇక ఈ స్మార్ట్ టీవీ 6.7 అంగుళాలు కలదు. ఈ స్మార్ట్ టీవీ యొక్క రిజల్యూషన్ క్వాడ్ హెచ్డీ గా ఉండనుంది. ఇందులో TCO సర్టిఫికెట్ కూడా అందిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: