బుల్లిపిట్ట: ఐపీఎల్ చూసే వారి కోసం.. ట్విట్టర్ సరికొత్త ఫీచర్..!!
కేవలం స్కోర్ వివరాలు కాకుండా లేటెస్ట్ ఐపీఎల్ మ్యాచ్ వివరాలను కూడా అందిస్తుంది. కేవలం ఎక్స్ప్లోర్ పేజీలో ఉండే క్రికెట్ టాబ్ ను క్లిక్ చేస్తే చాలు సరికొత్త పేజీ ఓపెన్ అవుతుంది.. అందులో మ్యాచ్ కు సంబంధించి వివరాలను లైవ్ లో చూసుకోవచ్చు అట. టీమ్ విడ్జ్ ట్స్ టాప్ ప్లేయర్స్ , మరియు జట్టు ర్యాంక్ లు, అధిక స్కోరు వంటి వివరాలను కూడా మనం చూసుకోవచ్చు. మ్యాచ్ జరుగుతూ ఉండగానే ఈ ర్యాంకింగ్ వివరాలను అప్డేట్ అందిస్తూ ఉంటుంది.
కేవలం డేటా పరిమితం కాకుండా, తిరిగి అందుకు సంబంధించిన వీడియోలను కూడా మనం దర్శించవచ్చు. ఇక ఇలాంటి సదుపాయం కోసం ట్విట్టర్ చాలా విస్తృతంగా ప్రయత్నిస్తోందట. ముఖ్యమైన ఈవెంట్స్, హైలెట్స్, కీలకమైన ప్రోగ్రామ్స్ లాంటివి షార్ట్ వీడియో రూపంలో మనకి అందించబోతున్నారు అని సమాచారం. ఇక అందుకు సంబంధించి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ట్విట్టర్ తెలియజేయడం జరిగింది. దీంతో ట్విట్టర్ ఉపయోగించుకునేవారు మరింత పెరుగుదల అవుతుందని వారు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి ఫీచర్లను అందిస్తుందో తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ట్విట్టర్ తీసుకొచ్చే అధునాతన ఫలితాల కోసం నెటిజన్లు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.