ఈ విశ్వంలో భూమి లాంటి గ్రహాలు చాలా వున్నాయి. అయితే మనుషుల్లాగా ఆ గ్రహాల్లో కూడా జీవరాసులు ఉంటాయా అని శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు పరిశోదనలు చేస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు ఏలియన్స్ ఉన్నట్లు ఆధారాలు దొరుకుతున్నాయి. కాని ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనే విషయం మిస్టరీగా మారింది.అంగారక గ్రహం మీద తలుపులాంటి నిర్మాణం(డోర్‌వే) ఉన్న ఓ ఫోటోను తాజాగా నాసా రిలీజ్ చేసింది. మార్స్ రోవర్ క్యూరియాసిటీ తీసిన ఈ ఫొటోలో ఒక పెద్ద బండరాయిని ఎవరో చెక్కినట్లు ఉన్న ఆ తలుపు నిర్మాణం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది.దీంతో ఇది ఏలియన్‌లు నిర్మించిందేంటూ ప్రచారం అనేది ఇప్పుడు మొదలైంది.మార్స్ మీద ఏలియన్ల ఉనికి ప్రచారం అనేది అసలు ఈనాటిది కాదు. తరచూ ఏలియన్ల ఉనికిని ప్రస్తావిస్తూ బోలెడన్ని కథనాలు అనేవి వెలువడేవి. అయితే తాజాగా బయటపడిన తలుపు తరహా నిర్మాణం మాత్రం ఆ వాదనను చాలా బలంగా సమర్థించింది. అది ఏలియన్ల పనేనంటూ వాదించడం మొదలుపెట్టారు కొంతమంది.
ఈ తరుణంలో ఆ డోర్‌వే మిస్టరీని చేధించే పనిలోకి దిగారు పరిశోధకులు.చివరికి అదొక రాయి భాగం మాత్రమే అని వారు తేల్చారు. సాధారణంగా.. అంగారకుడి మీద భూకంపాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఈ క్రమంలో మే 4వ తేదీన కూడా భారీ భూకంపం సంభవించినట్లు నాసా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో అలాంటి రాయి భాగం అనేది ఏదైనా ఆ తరహా నిర్మాణంలో ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు రోవర్ దానిని ప్రత్యేకమైన యాంగిల్‌లో ఫొటో తీయడం వల్లనే అదంతా కూడా ప్రత్యేకంగా ఏదో తలుపు నిర్మాణం లాగా కనిపించింది. మార్స్‌పై ఇలాంటి భాగాలు చాలానే ఉన్నాయని నాసా నిర్ధారించడం జరిగింది.ఇక డోర్ లాంటి బండరాయి ఫొటోల ద్వారా చూడడానికి పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ.. నిజానికి అది సెంటీమీటర్లు లేదంటే ఇంచుల్లో మాత్రమే ఉంటుందని, అదేంటో పూర్తిస్థాయిలో అంచనాకి రావడానికి మరిన్ని పరిశోధనలు అనేవి చాలా అవసరమని నాసా స్పష్టం చేస్తోంది.