బుల్లిపిట్ట: అంబాసిడర్ 0.2 కార్లు సరికొత్తగా మార్కెట్లోకి..?

Divya
గతంలో పెద్ద పెద్ద వారి దగ్గర, గవర్నమెంట్ వాహనాలు గా ఉండేవి ఎక్కువగా అంబాసిడర్ కార్లే. ఈ కార్లు చూడడానికి ఎంతో చూడముచ్చటగా కూడా కనిపిస్తాయి. అయితే కనుమరుగైపోయిన ఆ కార్లను తాజాగా ఆ సంస్థ రీ మోడలింగ్ చేసి సరికొత్త డిజైన్తో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.
Ck బిర్లా గ్రూప్కు చెందిన హిందుస్థాన్ మోటార్స్.. ఫైనాన్సియల్ మోటార్స్ కార్పొరేషన్.. పేరు పొందిన కార్లలో అంబాసిడర్ కార్ లుక్స్ ఎంతో హైలెట్ గా ఉండేవి. ఇప్పుడు తాజాగా "ఆంబోయ్" తరహాలో ఉన్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. హిందుస్థాన్ మోటార్స్ చెన్నై ప్రొడక్షన్ యూనిట్ లో ఈ నూతన అంబి కారు ను ఉత్పత్తి చేస్తున్నట్లు గా తెలియజేశారు. మళ్లీ ఇప్పుడు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో తన హవాను కొనసాగించెందుకు సిద్ధమవుతోంది. అంబాసిడర్ ఎలక్ట్రిక్ కారు తో రీ ఎంట్రీ అదిరిపోయేలా ఉండాలని సన్నాహాలు చేస్తున్నాయి ఆ సంస్థలు. అందుకోసం హిందుస్థాన్ మోటార్స్ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ అప్పట్లో తమ ఉద్యోగుల సంఖ్య..2,300 ఉండేవారు కానీ ప్రస్తుతం 300 వందల మందికి పూర్తిగా తగ్గిపోయింది.
ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ ఫౌగొట్ , హిందూ మోటార్ ఫైనాన్సియల్ వాటితో పరస్పర సహకారంతో ఇప్పుడు అంబాసిడర్ లేదు.. అంబి అనే మోడల్ అంజనీ డిజైన్ చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డాం ఇప్పుడు అంబాసిడర్ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలనుకుంటున్నామని తెలియజేశారు. అందుకోసం చైనీస్ ఇవి సంస్థలను కూడా సంప్రదించాము.. కానీ యూరోపియన్ కంపెనీల ఒక జత కట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలియజేశారు. ఇక ఇందులో పెట్టుబడి కింద రూ.600 కోట్ల రూపాయలు ఫ్రెంచ్ కార్ మేకర్ పూజోతో కలసి అంబాసిడర్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయబోతున్నట్లు గా ఉత్తమ బోస్ తెలియజేశారు. 1954లో స్వదేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రోత్సహించింది ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: