సాఫ్ట్ వేర్ కంపెనీలకు పెద్ద చిక్కొచ్చి పడిందే ?
పని విషయంలో అంతర్జాతీయంగా ఉద్యోగుల అభిప్రాయం పై రూపొందిన ఈ నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి విధులు నిర్వర్తింఛాలి అని గట్టిగా ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమని 25-34 ఏళ్ల వయసున్న యువ ఉద్యోగులు చెబుతున్నట్లు నివేదిక చెబుతోంది. అంతేకాదు అదేం పెద్ద కష్టం కాదని ఖచ్చితంగా కంపెనీలకు రావాల్సిందే అంటే వేరే ఉద్యోగం చూసుకుంటామని 35 ఏళ్ల లోపు వయసు ఉండే వారు ఎక్కువగా అంటున్నారట. అయితే 45-54 ఏళ్ల వయసున్న ఉన్న ఉద్యోగస్తులు మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా ఉన్నారు. 56 శాతం మంది మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుండగా...మిగిలిన వారు కార్యాలయాలకు వెళ్ళాలి అంటే తప్పేదేముంది వెళతాం అంటున్నారట.
భారత్‌లోనూ ఇదే తరహాలో పలు సర్వేలు జరుగగా ఇక్కడ కూడా అత్యదిక శాతం మంది ఉద్యోగస్తులు ఇంటి వద్ద నుండే విధులు నిర్వహించడానికి మొగ్గు చూపుతున్నారు అని తెలిసిందే. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒక రకంగా కంపెనీలకు ఎక్కువ నష్టం జరుగుతుంది అయితే...ఈ క్రమంలో ఉద్యోగస్తులను ఎలా రప్పించాలని నానా తంటాలు పడుతున్నాయి యాజమాన్యాలు.