150 kWh DC ఛార్జర్: ఇన్‌స్టాల్ చేసిన కియా మోటార్స్!

ఇక భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు చాలా వరకు కూడా ఇక ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలైనంత వేగంగా ఇంకా వాటికి కావలసిన సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులోకి రావడం లేదు. అయితే ఇలాంటి వాటికి పూర్తిగా చరమగీతం పాడటానికి కియా కంపెనీ ఇప్పుడు భారతదేశంలో 150 కిలోవాట్ సామర్థ్యం కలిగిన అధునాతన డిసి ఫాస్ట్ ఛార్జర్ ని ఇన్‌స్టాల్ చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా కియా కంపెనీ, ఇక ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగవంతమైన 150 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జర్ ని గురుగ్రామ్‌లోని ధింగ్రా డీలర్‌షిప్‌లో ఏర్పాటు చేయడం జరిగింది.ఇంకా ఈ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కియా ఈవి6 ఇక కేవలం 46 నిముషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.ఇంకా అలాగే ప్రస్తుతం 150 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జర్ అనేది భారతదేశంలో కియా కంపెనీ కేవలం ఒకటి మాత్రమే స్థాపించింది. కానీ ఇక ఈ నెల చివరి నాటికి లేదా ఆగస్ట్ నెల ప్రారంభం నాటికి దేశం మొత్తం మీద మొత్తం 12 నగరాల్లో మరిన్ని 150 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఇన్‌స్టాల్ చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది.ఇక అంతే కాకుండా కియా కంపెనీ ఆ వైపుకే ఇప్పుడు తన అడుగులు వేస్తోంది.


ఇక అలాగే కంపెనీ ఈ నెల చివరి నాటికి మరో 12 నగరాల్లో ఈ 150 కిలోవాట్ ఫాస్ట్ డిసి ఛార్జింగ్ స్టేషన్స్ కనుక ఇన్‌స్టాల్ చేస్తే అది వాహన వినియోగదారులకు ఇక ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా అలాగే భవిష్యత్తులో కూడా కంపెనీ మరిన్ని నగరాల్లో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఇన్‌స్టాల్ చేసే అవకాశం కూడా ఉంది.ఇక ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త కియా ఈవి6 అనేది 350 కిలోవాట్ వరకు కూడా డిసి ఫాస్ట్ ఛార్జింగ్‌కి బాగా సపోర్ట్ చేస్తుంది. కావున దాని స్టాండర్డ్ అనేది 22 కిలోవాట్ వాల్ బాక్స్ ఛార్జర్‌కు మెరుగైన ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది.ఇక దీని ద్వారా వాహన వినియోగదారుడు మరింత వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయం అనేది ఈజీగా పొందవచ్చు.ఇక ఈ 150 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ స్టార్ట్ చేసిన సందర్భంగా కియా మోటార్స్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ అయిన Myung-sik Sohn మాట్లాడుతూ.. దేశంలో ఇలాంటి వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులోకి రావడం వల్ల ఎలక్ట్రిక్ కార్ వినియోగదారులు ఛార్జింగ్ సమస్యకు చాలా దూరంగా ఉండవచ్చు. ఇంకా అలాగే 150 కిలోవాట్ డిసి ఛార్జింగ్ కి సఫోర్ట్ చేసే కార్లు ఈ ఛార్జింగ్ స్టేషన్ లో ఛార్జింగ్ సదుపాయం పొందవచ్చని కూడా అయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: