బుల్లి పిట్ట: రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ త్వరలోనే లాంచ్.. ఆకట్టుకుంటున్న టీజర్..!!
ఇక హెడ్ లైట్ అవుట్ గోయింగ్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 415 తరహాలో వృత్తాకారంగా ఉంది. ఇక ఈ బైక్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే 450 సిసి లిక్విడ్ కూల్ ,సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉపయోగిస్తున్నారు. ఇక అసిస్టెంట్ క్లచ్ సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ తో ఈ బైకు రావచ్చని ఆశిస్తున్నారు కస్టమర్లు . అంతేకాదు ఇంకా ఎన్నో మార్పులు కూడా ఉండవచ్చు అనే సమాచారం కూడా అందుతోంది. ముఖ్యంగా విస్తృతమైన టైర్లు , ముందువైపున మరింత అధునాతన అడ్జస్టబుల్ యు.ఎస్.డి ఫోర్కులు , రైడ్ మోడ్ లు, ఇన్ఫర్మేషన్ క్లస్టర్ కొంచెం పెద్ద పెట్రోల్ ట్యాంక్ వంటివి ఉండొచ్చు అని సమాచారం.
ఇకపోతే కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 విడుదలతో ఆల్రెడీ మార్కెట్లో ఉన్న కెటిఎమ్ 390 అడ్వెంచర్, బీఎండబ్ల్యూ జి310 GS వంటి శక్తివంతమైన మోటార్ సైకిల్ తో ఈ కంపెనీ పోటీ పడవచ్చు. అంతేకాకుండా కొత్త మోటార్ సైకిల్ ను విడుదల చేయడం కోసం చాలామంది కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ బైకు ధర రూ. 3.25 లక్షలు ఉండవచ్చని సమాచారం.