ఇండియాలో ఫేమస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ రెడ్‌మి ఎన్నో రకాల సూపర్ బడ్జెట్ ఫోన్ లని అందిస్తూ కస్టమర్ లని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా రెడ్ మి నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది. వచ్చే నెల సెప్టెంబర్ 6 వ తేదీన రెడ్‌మి 11 ప్రైమ్ 5g ఫోన్ లాంచ్ కానుంది.ఈ మేరకు కంపెనీ లాంచ్ తేదీని ప్రకటించింది. బడ్జెట్ రెడ్‌మి ప్రైమ్ సిరీస్‌ను అప్‌డేట్ చేసింది. సాధారణంగా రూ. 10వేల ధర పరిధిలోకి వస్తుంది. కానీ, 5g స్మార్ట్‌ఫోన్ ధర రూ. 11వేల కన్నా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అధికారిక లాంచ్ ముందు redmi redmi 11 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ కొన్ని వివరాలను వెల్లడించింది. redmi 11 Primeలో అసాధారణమైన డిజైన్ లేదు.రాబోయే 5g ఫోన్‌లో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్డ్ డిస్‌ప్లే ఉంటుందని తెలిపింది. 50-MP ప్రధాన సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. బ్లూ, గ్రేతో సహా రెండు కలర్ ఆప్షన్లలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని సూచిస్తుంది.ఇందులో ఆడియో జాక్‌తో పాటు డ్యూయల్ స్పీకర్‌లు కూడా ఉన్నట్లు కనిపించడం లేదు. బడ్జెట్ ఫోన్ హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 700 SoCని అందిస్తుంది.
డిస్‌ప్లే సైజుతో పాటు బ్యాటరీపై వివరాలు అందుబాటులో లేవు. 5,000mAh బ్యాటరీతో రానుందని అంచనా. కొన్ని బడ్జెట్ ఫోన్‌లలో అదే యూనిట్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు 5,000mAh బ్యాటరీని అందిస్తాయి. ఎందుకంటే దిగువ విభాగంలో సాధారణంగా పెద్ద డిస్‌ప్లేతోపాటు పెద్ద బ్యాటరీని పొందవచ్చు.ఈ డివైజ్ ఫ్లాట్ సైడ్‌లు, కర్వడ్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. పవర్, వాల్యూమ్ బటన్ స్మార్ట్‌ఫోన్ కుడివైపున అందించారు. వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించడం లేదు. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండవచ్చు. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో రెడ్‌మి ఇన్-డిస్‌ప్లే సెన్సార్‌ను అందిస్తుందని ఆశించడం లేదు. మిగిలిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.Redmi 11 Prime 5g ఈ ఏడాది మార్చిలో చైనాలో లాంచ్ అయిన redmi Note 11E 5g ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్ చెప్పవచ్చు. ఈ ఫీచర్లు కూడా సమానంగా కనిపిస్తాయి. కొత్త redmi ఫోన్ వాస్తవానికి redmi Note 11E 5g కావచ్చు. 6.58-అంగుళాల LCD డిస్‌ప్లే , 18W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్టు, 5-MP ఫ్రంట్ కెమెరా, 5,000mAh బ్యాటరీతో రానుంది.