బుల్లి పిట్ట: మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్..!
రెడ్మీ 11 ప్రైమ్ 5G:
తాజాగా రెడ్మి 11 ప్రైమ్ 5g అలాగే రెడ్మి 11 ప్రో 4G మోడల్స్ రిలీజ్ అయ్యాయి. రెడ్మీ 11 5g స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999.. 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999.. ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ద్వారా కొనుగోలు చేస్తే 1000 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఈ సెల్ ప్రారంభం అవుతుంది. 22.5 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సల్ కెమెరా, సెల్ఫీ కోసం ఎయిట్ మెగా పిక్సెల్ అందించారు. 6.58 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.
రెడ్మీ 11 ప్రైమ్ 4G:
4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999.. 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999.. ప్లే ఫుల్ గ్రీన్, ఫ్లాషి బ్లాక్, పెప్పీ పర్పులు వంటి కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు అయితే సేల్ తేదీని ప్రకటించలేదు . ముఖ్యంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ మొబైల్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఫీచర్స్ కూడా దాదాపు రెడ్మి లెవెన్ ప్రైమ్ 5g ను పోలి ఉంటాయి.
రియల్ మీ C33:
ఈ స్మార్ట్ ఫోన్ మీకు రూ.10 వేల లోపు బడ్జెట్ ధరలో లభిస్తుంది.3GB ర్యామ్ + 32 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999 కాగా 4GB + 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. ఇక సెప్టెంబర్ 12వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకానికి రానుంది. 10W స్టాండర్డ్ చార్జింగ్ సపోర్టుతో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ని కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.