ఆన్ లైన్ కోర్సులకు ఇటీవల కాలంలో డిమాండ్ అనేది చాలా బాగా పెరిగింది. ఈ నేపధ్యంలో అన్ని సంస్థలు కూడా ఈ ఆన్ లైన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.తాజాగా ఇండియాలో పేరు గాంచిన ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ అయిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ పిలానీ ఆన్లైన్ మోడ్‌లో బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కోర్సును ప్రారంభించింది. ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ కోర్సును అందించనున్నారు. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా స్ట్రీమ్‌లో 12వ తరగతి పాసైన విద్యార్థులు కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే కాలేజీల్లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా కోర్సు కోసం అప్లై చేసుకోవచ్చు.కోర్సులో భాగంగా కేవలం డేటా సైన్స్ కాకుండా కంప్యూటర్ సైన్స్ కింద అనేక రకాల సబ్జెక్టుల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తామని బిట్స్ పిలాని పేర్కొంది. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు మెషిన్ లెర్నింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, హ్యూమన్-కంప్యూటర్ ఇంటరాక్షన్, వెబ్యా,ప్ డెవలప్‌మెంట్‌తోపాటు లీడర్షిప్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ వంటి వర్క్‌ప్లేస్ స్కిల్స్‌లో డిమాండ్‌కు తగ్గట్టుగా ఎక్స్ పీరియన్స్ పొందనున్నారని బిట్స్ పిలాని స్పష్టం చేసింది.
ప్రస్తుతం నవంబర్ నెల బ్యాచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.బిట్స్ పిలానీలో ఈ ఆన్లైన్ కోర్సు సంవత్సరానికి రెండు సార్లు జులై, నవంబర్‌లో ప్రారంభమవుతుంది. ముందస్తు దరఖాస్తు గడువు నవంబర్ 15, 2022గా నిర్ణయించారు. తరగతులు నవంబర్ 30న ప్రారంభమవుతాయి. కోర్సు కాలవ్యవధి మూడేళ్లు అయితే, డిగ్రీ పూర్తి చేయడానికి కేటాయించిన గరిష్ట సమయం ఆరు సంవత్సరాలు. ఈలోపు కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ప్రకారం ఈ కోర్సులో ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంది. కోర్సులో రెండేళ్ల తర్వాత డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు డిప్లొమాకు అర్హులు.కోర్సు ఫీజు వివరాలకు సంబంధించి బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలంటే భారతీయ విద్యార్థులు సుమారు రూ.3.1లక్షలు ఫీజుగా చెల్లించాలి. ఇక విదేశీ విద్యార్థులు 6,000 యూఎస్ డాలర్లు చెల్లించాలి. ఎలాంటి స్కాలర్షిప్లను అందించరు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.bits-pilani.ac.in/ ని సందర్శించండి.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.
మరింత సమాచారం తెలుసుకోండి: