బుల్లి పిట్ట:తక్కువ ధరకే పవర్ ఫుల్ సౌండ్ బార్స్..!!

Divya
ప్రతి ఒక్కరు ఇంట్లో చూసేటువంటి సినిమాలు థియేటర్ ఫీలింగ్ కలగాలంటే కచ్చితంగా సౌండ్ బార్ ఉపయోగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఇప్పుడు ప్రస్తుతం వరుస ఆఫర్లను ప్రకటిస్తూ ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు కూడా కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలా సరికొత్త టెక్నాలజీ పోర్టబుల్ గ్రాడ్యుయేట్లను తీసుకువచ్చే protronics బ్రాండ్ సంస్థ ఒక సరికొత్త సౌండ్ బార్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సౌండ్ బార్లను సౌండ్ స్లీక్ సిరీస్ నుండి విడుదల చేయడం జరిగింది.

ఇందులో sound slick-iv ,sound slick -v వంటి వీరేంట్లలో లభిస్తుంది ఈ సౌండ్ బార్లను పవర్ ఫుల్ మరియు నాణ్యమైన సౌండ్ అందించే విధంగా రూపొందించడం జరిగిందట అంతేకాకుండా సౌండ్ బార్లను పేరుకు తగ్గట్టుగా సన్నని డిజైన్తో అందించడం జరిగింది. ఈ సౌండ్ బార్ ధర ,ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.protronics బ్రాండెడ్ నుంచి లాంచ్ అయిన ఈ రెండు సౌండ్ బాక్స్ కూడా చాలా సన్నని డిజైన్తో తయారు చేశారు రెండు సౌండ్ బార్ స్క్రాచ్ రెసిడెన్ట్ కలిగిన విధంగా రూపొందించారు.

Sound slick -iv సౌండ్ బార్ ధర మాత్రం రూ.5,499 రూపాయలకే ప్రకటించారు. ఈ సౌండ్ బార్ HDMI ARC , ఆప్టికల్,AUX మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లతో లభిస్తుంది ఈ సౌండ్ బార్ ఎనీబుల్ కూడా కలిగి ఉంటుంది టోటల్గా 120 W సౌండ్ అవుట్ ఫుట్ ని యూజర్లకు అందిస్తుంది. SOUND SLICK-V సౌండ్ బార్ విషయానికి వస్తే ఈ సౌండ్ బార్ కూడా ఆప్టికల్, బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్లతో లభిస్తుంది. దీని ధర విషయానికి వస్తే రూ.3,499 రూపాయలకి లభిస్తుంది ఇది రెండు 30W  స్పీకర్లతో వస్తుంది. ఈ రెండు సౌండ్ బార్లకు ఒక ఏడాది గ్యారెంటీతో కలదు ఈ సౌండ్ బార్లను అధికారిక వెబ్సైట్లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే ఆర్డర్ చేసుకోవాలట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: