బుల్లి పిట్ట: ఐఫోన్-13 మొబైల్ పైన భారీ డిస్కౌంట్..!!

Divya
ఐఫోన్ మొబైల్ ను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించాలని అందరూ ఆత్రుతగా ఉంటారు. అయితే ఐఫోన్ లో ఇప్పటివరకు పలు సిరీస్ లో వెలుబడుతూనే ఉన్నాయి. తాజాగా ఐఫోన్ -14 మొబైల్స్ విడుదలయ్యాయి. ఇక ఐఫోన్-13 మొబైల్ కు సంబంధించి ధరను కూడా అధికారికంగా తగ్గించారు. భారత్ మార్కెట్లో ఆపిల్ ఇండియా స్టోర్లో ఐఫోన్ -13 మొబైల్ ని అధికారికంగా విడుదల చేసినప్పుడు దాని ధర రూ.69,900 కాగా.. పలు రకాల వెబ్సైట్లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్-13 మొబైల్ పైన డిస్కౌంట్ ను ప్రకటించింది దాని తర్వాత ఈ మొబైల్ రూ.59,990 కన్న తక్కువ ధరకే అందుబాటులో ఉన్నది. ఇక ఈ మొబైల్ డీల్ ను మరింత ఆకర్షణీయంగా చేసేందుకు ఇతర బ్యాంకు కార్డుల ద్వారా కూడా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ను దీపావళి సందర్భంగా పలు స్మార్ట్ మొబైల్స్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 13 మొబైల్  SBI బ్యాంకు పైన 10 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది. ఇక ఈ మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.16,900 వరకు తగ్గింపు కూడా చేస్తోంది.

ఇలా పలు రకాలుగా ఆఫర్ల కింద మొబైల్ న  సుమారుగా రూ.42,000 రాబోతుంది. అయితే చేంజింగ్ మొబైల్ కండిషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ -13,14 మొబైల్స్ రెండు ఒకే ఫీచర్లతో కలిగి ఉంటాయి. ఇండియాలో ఐఫోన్ -14 మొబైల్ ధర రూ.79,000 రూపాయల నుంచి ప్రారంభమయింది. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.1 అంగుళాలు కలదు. ఇక ఈ మొబైల్ IOS ఆధారంగా పనిచేస్తుంది. ఈ మొబైల్ సరికొత్త ఫీచర్లతో బ్యాటరీ బ్యాక్అప్ తో పనిచేస్తుంది. అయితే ఐఫోన్ మొబైల్ కొనాలనుకునే వారికి ఈ ఆఫర్ ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: