బుల్లి పిట్ట: ఈ విషయాలను గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక అంతే..!!

frame బుల్లి పిట్ట: ఈ విషయాలను గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక అంతే..!!

Divya
ప్రస్తుతమున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా మొబైల్, ల్యాప్ ట్యాప్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. మనం ఏం కావాలన్నా కచ్చితంగా గూగుల్ లో  సెర్చ్ చేస్తూ ఉంటాము .ముఖ్యంగా ఇంటి అడ్రస్ నుంచి భోజనం వరకు కూడా ప్రతి ఒక్కటి గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఉంటాము. ఇలా ఈ మధ్యకాలం లో ప్రతి ఒక్కరము కూడా గూగుల్ పైన ఆధారపడి ఉన్నాము. నేటితరం యువత ఎక్కువగా ఏ చిన్న పని కావాలన్నా స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు.

ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనీ ట్రాన్సాక్షన్ కావాలన్నా కూడా ఎక్కువగా మొబైల్ లో నుంచి చేస్తూ ఉన్నాము. ఇలాంటి టెక్నికల్ గా ఎన్నో ఉపయోగిస్తున్న మనం కొన్నిటిని మాత్రం మన గూగుల్ లో సెర్చ్ చేస్తే మనకి పలు ప్రాబ్లమ్స్ వస్తాయని కొంతమంది టెక్నిపుణులు తెలియజేస్తున్నారు.
ప్రతి ఒక్కరి మీద కూడా ప్రభుత్వం మీద సంస్థలు అప్రమత్తంగా ఉంటాయి. ముఖ్యం గా చిన్నారులకు సంబంధించి పోర్న్ గ్రఫి కంటెంట్ను గూగుల్ లో  వెతికిన శిక్ష అర్హులని తెలియజేశారు. ఒకవేళ వీటిని పొరపాటున కూడా సెర్చ్ చేస్తే ఫోక్సొ చట్టం కింద జైలు పాలు చేయొచ్చట.
ఇక అలాగే బాంబులను ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని కూడా గూగుల్ లో  సెర్చ్ చేస్తే చిక్కులు తప్పవని తెలియజేస్తున్నారు.ఇటు వంటి కంటెంట్ వెతికిన సెక్యూరిటీ సంస్థలు కూడా వెంటనే గుర్తిస్తా యట.

చట్టపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరొకటి ఏమిటంటే..అబార్షన్ చేయడం ఎలా అనే విషయాన్ని గూగుల్ లో వెతికితే జైలు శిక్ష తప్పదట. డాక్టర్ అనుమతితోనే ఇలాంటి విషయాలను  చేయాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటివే కాకుండా మరికొన్ని వాటిని వెతికినా కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుచేతనే గూగుల్ లో వెతికేటప్పుడు ఇలాంటి తప్పులు చేయకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: