'ఐవోమి ఎనర్జీ' కంపెనీ ఈ పండుగ సీజన్ నేపథ్యంలో 'జీట్ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్' స్కూటర్ ని రిలీజ్ చేసింది.మార్కెట్లో విడుదలైన కొత్త iVOOMi జీట్ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రెడ్ హైలైట్లతో గ్లోసీ బ్లాక్, బ్లూ హైలైట్లతో గ్లోసీ బ్లాక్, రెడ్ హైలైట్లతో మ్యాట్ వైట్ మరియు ఆరెంజ్ హైలైట్లతో మ్యాట్ వైట్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ జీట్ఎక్స్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఖరీదైనదిగా ఉంటుంది.కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.02 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు ప్రత్యేక డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. అయితే కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే కస్టమర్లు ఇప్పుడు రూ. 98,000 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
అయితే ఇది కేవలం పరిమిత కాలానికి మాత్రమే పరిమితం చేయబడింది. అందుకే ఇప్పుడు కొనుగోలు చేసే కస్టమర్లు ఈ స్కూటర్ కొనుగోలుపైన రూ. 4,000 తగ్గింపును పొందవచ్చు.ఈ స్కూటర్ కొనుగోలుపైన ఈ డిస్కౌంట్ 2022 నవంబర్ 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ తన 'బిగ్ ఎనర్జీ ఫెస్ట్'లో భాగంగా తన ఎలక్ట్రిక్ వాహనాలపై డిస్కౌంట్లను కూడా ప్రకటించింది. కావున ఇప్పుడు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 4,000 తగ్గింపు లభిస్తుంది. అంతే కాకూండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపైన కొన్ని బెనిఫీట్స్ కూడా పొందవచ్చు.జీట్ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుచేసి కస్టమర్లు ఇప్పుడు రూ. 5,000 వరకు విలువైన బహుమతులను ఇంకా యాక్ససరీస్ ని ఉచితంగా పొందవచ్చు, అందువల్ల ఇది కొనుగోలుదారులను మరింత ఆకర్శించే అవకాశం ఉంటుంది.