బుల్లి పిట్ట: శాంసంగ్ నుంచి F-14 బడ్జెట్ మొబైల్ వచ్చేస్తోంది..!!

Divya
ప్రముఖ సౌత్ కొరియా దిగ్గజ సంస్థ లో ఒక టైన సాంసంగ్ బ్రాండెడ్ నుంచి ఒక సరి కొత్త మొబైల్ ను ఇండియాలో లాంచ్ చేయబోతోంది. భారత్ మార్కెట్లోకి మరొక F సిరీస్ గల మొబైల్లో విడుదల చేస్తోంది. నివేదికల ప్రకారం దక్షిణ కొరియా కంపెనీ..SAMSUNG GALAXY F-14 మొబైల్ ని జనవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ మొబైల్ GALAXY -13 తర్వాత మోడల్ గా రాబోతోంది. ఈ డివైస్ 5g కనెక్టివిటీ ఆధారంగా లభిస్తుందా లేదా అనే విషయంపై ఇంకా రివిల్ కాలేదు.కానీ రాబోయే ఫోన్ కు సంబంధించి కొన్ని విషయాలు వెళ్ళబడ్డాయి.

సాంసంగ్ గెలాక్సీ-13 మొబైల్ ఏడాది మార్కెట్లోకి ప్రారంభం అయింది. బడ్జెట్ కేటగిరి ఫోన్ కాగా దీని ధర కేవలం రూ.11,999 రూపాయలకి అందుబాటులో ఉన్నది. గెలాక్సీ 14 మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే..6.6 అంగుళాల ఫుల్ హెచ్డి ఎల్సిడి స్క్రీన్ తో లభిస్తుంది. ఈ మొబైల్ డిస్ప్లే ముందు కెమెరా పై వాటర్ డ్రాప్ నాచుని కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ ఆధారంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ONE UI 4.0 కష్టం స్క్రీన్ పై రన్ అవుతుందట.
వినియోగదారులు మైక్రో SD కార్డును కూడా ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్ మొబైల్ వెనుకన త్రిబుల్ కెమెరా సెట్ అప్ కలదు.50 mp ప్రైమరీ కెమెరాతో పాటు..5MP,2MP కెమెరాలు కలవు. వీడియో కాల్ కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్సెల్ కెమెరా కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..6000 MAH సామర్థ్యం కలిగి ఉంటుందట.18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుందని సమాచారం. ఇక మొబైల్కు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలదు. ఇక ఈ మొబైల్ వైఫై బ్లూటూత్ 5.0, USB ,టైప్-C పోర్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ కలవు. ఈ మొబైల్ ధర ఇంకా తెలుపలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: