బుల్లి పిట్ట: పబ్లిక్ వైఫై వాడుతున్నారా.. జర జాగ్రత్త..!!

Divya
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ సదుపాయాన్ని అన్నిచోట్ల వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే ఇలా ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు వైఫై నీ ఎక్కువగా ఉపయోగించేవారు చాలామందే ఉన్నారు. అయితే ఇలా ఉపయోగించడం వల్ల వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసే అవకాశం ఉందని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తూ ఉన్నారు. పబ్లిక్ వైఫై వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరం కూడా ఇంటర్నెట్ లేకుండా కాసేపు కూడా ఉండలేక ఉంటున్నాము. ముఖ్యంగా ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలన్నా సరే, ఆఫీస్ వర్క్ చేయాలన్నా సరే కచ్చితంగా ఇంటర్నెట్ సదుపాయం అనేది కంపల్సరీ ఉండాల్సిందే. అయితే మనం అనుకోని పరిస్థితులలో మన మొబైల్లో నెట్ బ్యాలెన్స్ లేకపోయినప్పుడు ఫ్రీ వైఫైలను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సెక్యూరిటీ సైబర్ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. పబ్లిక్ ప్రదేశాలలో అందుబాటులో ఉండే వైఫై వినియోగించి మనం ఈమెయిల్ ఇతర సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేయడం వల్ల ఆన్లైన్ బ్యాంకు లావాదేవీలు మన వ్యక్తిగత విషయాలు కూడా ఇతరులకు తెలిసి అవకాశం ఉందని సైబర్ నిపుణులు సూచిస్తూ ఉన్నారు.

ముఖ్యంగా మన ఐడి పాస్వర్డ్లను సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ద్వారా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని కూడా తెలియజేశారు. పబ్లిక్ ప్రాంతంలోని వైఫై వాడినట్లయితే సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని కొట్టివేసి దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సెక్యూరిటీ నిపుణులు తెలియజేస్తున్నారు. వీలైనంతవరకు పబ్లిక్ వైఫై వాడకుండా ఉండాలని తప్పని పరిస్థితుల్లో అయితే ఇలాంటి పబ్లిక్ వైఫై సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అయితే ఇలా పబ్లిక్ వైఫై ని ఉపయోగించేవారు VPN ఉపయోగించడం వల్ల మన మొబైల్ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు చేతికి చిక్కకుండా జాగ్రత్త పడవచ్చని నీపునులు హెచ్చరిస్తూ ఉన్నారు. అందుచేతనే ప్రతి ఒక్కరూ వైఫై వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: