బుల్లిపిట్ట: వన్ ప్లస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ లాంచ్..!
ఈ కొత్త ఫోన్ లాంచ్ అయ్యి నెల కూడా గడవక ముందే ఇంతలో వన్ ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ ఫోటోలు కూడా ఆన్లైన్లోకి వచ్చేసాయి. ఇకపోతే వన్ ప్లస్ నార్డ్ CE 3 ను తాజాగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తోంది వన్ ప్లస్. అలాగే ట్రిపుల్ కెమెరా సెట్ అప్ యూనిసోక్ చిప్ సెట్ తో సహా పలు ప్రత్యేక ఫీచర్లతో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఆన్లైన్లో లీకైన ప్రత్యేక ఫీచర్ల విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే డిజైన్ ను కలిగి ఉంటుంది.120 Hz రీ ఫ్రెష్ రేటు, 1080 పిక్సెల్ మరియు మెరుగైన భద్రతతో లాంచ్ చేయబడుతుందని చెప్పబడింది.
ముఖ్యంగా ఈ ఫోన్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది అని క్వాల్కం స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుందని సమాచారం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్ విడుదల అవుతోంది. ఇక కెమెరా విషయానికి వస్తే 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా తో 2 మెగా పిక్సెల్ మైక్రో కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాని కూడా అమర్చారు.67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.