వరల్డ్ ఫేమస్ టాప్ ఆటోమొబైల్ కంపెనీ టయోటా ఎట్టకేలకు తన 'ల్యాండ్ క్రూయిజర్ 300' 2023 ఆటో ఎక్స్‌పో వేదికగా లాంచ్ చేసింది.కంపెనీ లాంచ్ చేసిన ఈ ల్యాండ్ క్రూయిజర్ 300 గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఆటో ఎక్స్‌పో 2023 లో ప్రదర్శించబడిన ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 ధర వచ్చేసి రూ. 2.17 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంది. కంపెనీ 2022 ఆగష్టు నెలలో మొత్తం రూ. 10 లక్షల టోకెన్ ధరతో బుకింగ్స్ తీసుకోవడం జరిగింది. అయితే బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ టైంలోనే ఈ SUV లు అమ్ముడైపోవడం జరిగింది. ఇక కంపెనీ ప్రస్తుతం ఎటువంటి బుకింగ్‌లను తీసుకోవడం లేదని డీలర్ వర్గాలు చెబుతున్నాయి.ఇక కంపెనీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ల్యాండ్ క్రూయిజర్ 300 కోసం బుకింగ్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఈ SUV డిజైన్ ఇంకా ఫీచర్స్ పరంగా చాలా సూపర్ గా ఉంటుంది.
దీని డిజైన్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద గ్రిల్, దానికి రెండూవైపులా అందమైన LED హెడ్‌ల్యాంప్‌లు ఇంకా ఫాగ్ ల్యాంప్ ఉంటాయి.అలాగే సైడ్ ప్రొఫైల్ భారీగా కనిపించడమే కాకుండా ఫ్లెర్డ్ వీల్ ఆర్చ్‌లతో ఉంటుంది.అలాగే వెనుక వైపున LED టెయిల్‌లైట్‌లతో స్ట్రెయిట్ గా ఉండే టెయిల్‌గేట్ చూడవచ్చు.ఇంకా ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో సెంట్రల్ కన్సోల్, డోర్ ప్యాడ్‌లు, స్టీరింగ్ వీల్‌పై వుడ్, సిల్వర్ ఫినిషింగ్ తో బ్లాక్, బేజ్ కలర్ థీమ్ పొందుతుంది. క్యాబిన్ మొత్తం కూడా చాలా వరకు బ్లాక్ కలర్ థీమ్ ని పొందుతుంది. అందువల్ల చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.దీని ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కార్ లో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్, 14-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు ఇంకా సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్లు అన్ని కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఈ ల్యాండ్ క్రూయిజర్ 300 తప్పకుండా ఆకర్షిస్తుంది.