చీప్ & బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే..?

ఇక ఆటో మొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ చాలా బాగా నడుస్తోంది. అందరూ ఇప్పుడు పర్యావరణ హితమైన  వాహనాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.అయితే ఈ ఎలక్ట్రిక్  బైక్ లు అయినా.. స్కూటర్లు అయినా.. కార్లు అయినా మాములు వాహనాల కంటే చాలా ఎక్కువ ధరలో ఉంటున్నాయి. ఆ ధరలు కూడా సామాన్యుల బడ్జెట్ కు అందనంత ఎత్తులో ఉంటున్నాయి.దాని ఫలితంగా వాటి కొనుగోళ్లు కూడా తక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హాప్ ఎలక్ట్రిక్ కంపెనీ చవకైన స్కూటర్ ను లాంచ్ చేసింది. అంతేకాక ఇది 120 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని ఆ కంపెనీ ప్రకటించుకుంది.ఈ స్కూటర్ కి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇక హాప్ ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పటికే రెండు మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎల్ వైఎఫ్(Lyf) స్కూటర్ ఇంకా ఓక్సో(Oxo) ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లు ఉన్నాయి. ఇప్పుడు మూడో మోడల్ లియోని (Leo) కూడా కంపెనీ లాంచ్ చేసింది. దీని ధర వచ్చేసి రూ. 97,000 నుంచి మొదలవుతుందని ఆ కంపెనీ ప్రకటించింది.


ఈ హాప్ లియో స్కూటర్ ఇక 72V BLDC హబ్ మోటార్ తో వస్తుంది. ఇది 2.2kW అవుట్ పుట్ తో పాటు 90Nm మాక్సిమం టార్క్ ను జనరేట్ చేస్తుంది.దీనికి 2.1kWh పవర్ తో లిథియం ఐయాన్ బ్యాటరీ వస్తుంది. ఇది వాటర్, రస్ట్ ప్రూవ్ తో వస్తుంది. ఇంకా అలాగే దీనిలో నాలుగు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఎకో, పవర్, స్పోర్ట్స్ ఇంకా అలాగే రివర్స్ అనే నాలుగు మోడ్లలో మంచి రైడింగ్ అనుభూతినిస్తాయి.ఇంకా ఈ స్కూటర్ లో మొత్తం 850 వాట్ల చార్జర్ ఉంటుంది. బ్యాటరీ 0 నుంచి 80 శాతం చార్జ్ అవడానికి మొత్తం 2.5 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ అయితే దాదాపు 120 కిలోమీటర్ల మైలేజీని ఈ బైక్ వస్తుంది. ఇంకా అలాగే దీనికి 10 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో పాటు ముందు వెనుక డిస్క్ బ్రేకులు కూడా వున్నాయి.దీనిలో రిజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం కూడా అందుబాటులో ఉంది. అలాగే ఈ బైక్ 160 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తుంది.ఈ బైక్ ఏకంగా 160 కేజీల వరకూ బరువును మోయగల్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: