ఆడి నుంచి సూపర్ కార్.. ఎక్కితే మరో ప్రపంచమే?

లగ్జరీ కార్ కంపెనీ ఆడి తన స్పియర్ కాన్సెప్ట్ లో తన నాల్గో ఎలక్ట్రిక్ వాహనం యాక్టివ్ స్పియర్ ను లాంచ్ చేసింది. పూర్తి ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో ఉన్న ఈ కారు సూపర్ పవర్ తో అందుబాటులో రానుంది. స్పియర్ ఈవీ కాన్సెప్ట్ లో ఇదే తన చివరి మోడల్ అని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ కార్ లో ఎక్కడ బటన్స్ గానీ స్క్రీన్ లు గానీ ఉండవు. కంప్లీట్ కన్సీల్డ్ టైప్ ఇంటీరియర్ ఉంటుంది. కానీ అద్భుతమైన వర్చువల్ ఎక్స్ పీరియన్స్ మీకు అందిస్తుంది. ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..ఇంకా ఈ కారులో ఎక్కడా స్క్రీన్ లుగాని అలాగే బటన్ లు గానీ ఉండవు. కేవలం డ్రైవర్ రాగానే కావాల్సినవి ఓపెన్ అవుతాయి. ఈ కార్ లో అన్ని ఫంక్షన్లను కంట్రోల్ చేసేందుకు ఆగ్యూమెంటెడ్ రియాలిటీ(ఏఆర్) టెక్నాలజీని ఆడి కంపెనీ వాడింది. కారులోకి ఎక్కి వర్చువల్ రియాలిటీ(వీఆర్) గ్లాసెస్ పెట్టుకోగానే మిమ్మల్ని సరికొత్త వర్చువల్ ప్రపంచంలోనికి తీసుకెళ్తుంది. దీని ద్వారానే నావిగేషన్, కారులో క్లైమెట్ కంట్రోల్ ఇంకా అలాగే ఎంటర్ టైన్మెంట్ ఫీచర్లను వినియోగించుకునే వీలుంటుంది.


ఈ కారులో వుండే మిక్స్ డ్ రియాలిటీ అనే డిజిటల్ ఎకో సిస్టమ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ని త్రీడిలో ప్రొజెక్ట్ చేస్తుంది.ఈ కార్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్ కారైనా.. డ్రైవర్ కోరుకొన్నప్పుడు మాన్యుల్ మోడ్ లోకి మార్చుకునే ఫీచర్ ఉంటుంది. ఇంటీరియర్ ప్యానల్ డ్యాష్ బోర్డ్ లో హిడెన్ గా ఉన్న స్టీరింగ్ వీల్ డ్రైవర్ కమాండ్ తో బయటకు రావడం వల్ల మాన్యువల్ మోడ్ అనేది ఆన్ అవుతుంది.ఇక ఈ ఆడి కారు ఏకంగా 600 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తోందని ఆడి కంపెనీ పేర్కొంది. అంటే దీనిలో వుండే బ్యాటరీ సింగిల్ చార్జ్ తో ఏకంగా 600 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అలాగే బ్యాటరీ కూడా ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ తో వస్తోంది. ఇది 5 శాతం నుంచి 80 శాతానికి కేవలం 25 నిమిషాల్లోనే చార్జ్ అవుతుందని ఆడి కంపెనీ తెలిపింది.మొత్తం 800 volt సామర్థ్యంతో కూడిన చార్జింగ్ టెక్ 10 నిమిషాల్లోనే ఏకంగా 300 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి అవసరమైన పవర్ ను ఇది స్టోర్ చేస్తుంది.అలాగే దీని బయట వైపు 22 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.ఇంకా కారు బాడీలో ఎక్కువ భాగం గ్లాస్ తో ఉంటుంది. ముందు భాగంలో రన్నింగ్ లైట్లు ఇంకా వెనకాల అల్ట్రా ఫైన్ ఎల్ఈడీ టెక్నాలజీతో వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: