తక్కువ బడ్జెట్ లో మంచి రేంజ్ ఉన్న స్కూటర్లని కోరుకునేవారు ఇంకా తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనం కావాలి అనుకుంటున్న వారి కోసం.. మార్కెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి అందుబాటులో ఉంది. పోయిస్ గ్రేస్ కంపెనీ దీనిని లాంచ్ చేసింది. దీని డిజైన్ ఇంకా లుక్ చాలా సూపర్ గా ఉంటాయి. ఇక దీనిని రెండు వేరియంట్లలో ఆ కంపెనీ వినియోగదారులకు అందిస్తోంది. ఈ బైక్ ధర, ఫీచర్లు ఇంకా అలాగే స్పెసిఫికేషన్‌ల వంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 60V, 42Ah పవర్ గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్‌కి 800 W పవర్ ఎలక్ట్రిక్ హబ్ మోటార్ ఉంటుంది. దీని రేంజ్, మాక్సిమం స్పీడ్ కి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ఈ స్కూటర్ లోని బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే110 నుంచి120 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.అలాగే మాక్సిమం 50 kmph వేగం తో ఈ స్కూటర్ పనిచేస్తుంది.
ఈ స్కూటర్ ముందు చక్రానికి డిస్క్ బ్రేక్ ఇంకా వెనుక చక్రానికి డ్రమ్ బ్రేక్ అందుబాటులో ఉంది. అలాగే పటుకాంబి బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది . సస్పెన్షన్ సిస్టమ్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ సిస్టమ్ ఇంకా అలాగే వెనుక భాగంలో స్ప్రింగ్ ఆధారిత సస్పెన్షన్ సిస్టమ్‌ను కంపెనీ అందించింది.పుష్ బటన్ స్టార్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ ఓడోమీటర్, ఎల్‌ఈడీ హెడ్ లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్ ఇంకా అలాగే ఎల్‌ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 34 Ah వేరియంట్‌ను రూ. 87,542 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో రిలీజ్ చేసింది . టాప్ వేరియంట్ విషయానికి వస్తే.. దీని ధర రూ. 92,542 గా ఉంది. అలాగే దీని 42Ah వేరియంట్ ప్రారంభ ధర రూ. 93,465 ఎక్స్-షోరూమ్ ఇంకా ఇది ఆన్-రోడ్ రూ. 98,965 గా ఉంది.