బుల్లి పిట్ట: మొబైల్ లో వైఫై కాలింగ్ ఉపయోగించడం ఎలాగంటే..!!

Divya
మారుతున్న కాలం కొద్ది టెక్నాలజీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు స్మార్ట్ మొబైల్స్ లో పెద్దగా ఫీచర్లు లేకుండా ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీతో సరికొత్త ఫీచర్స్ వస్తూనే ఉన్నాయి మొబైల్స్. మనం ఫోన్ కాల్స్ మాట్లాడుతున్న సమయంలో ఎన్నో అడ్డంకులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వాయిస్ సరిగ్గా వినిపించకపోవడం మధ్య మధ్యలో కట్ అవ్వడం పలు రకాల సమస్యలు కూడా ఎదురవుతూనే ఉంటాయి. ఇక మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ చాలా తక్కువగా ఉన్న సమయాలలో కాల్స్ డ్రాప్ అవుతూ కూడా ఉంటాయి.
దీంతో సిగ్నల్ సరిగ్గా అందక ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో కాల్ కట్ అవ్వడం లేదా అవతలి వ్యక్తికి వాయిస్ సరిగ్గా వినిపించకపోవడం వంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో యూజర్లు వైఫై కాలింగ్ ఫీచర్ ను ఎనేబుల్ చేయవలసి ఉంటుంది. భారత్లో ఎయిర్టెల్, జియోతో పాటు పల్లె టెలికాన్ సంస్థలు కూడా వైఫై కాల్ సదుపాయాన్ని ఉచితంగా యూజర్లకు అందిస్తున్నాయి. వైఫై కాలింగ్ .. వైఫై నెట్వర్క్ తో పనిచేస్తుంది.వైఫై సిగ్నల్ ఉన్నచోట ఈ సేవలను ఉపయోగించుకోవడం వీలు పడుతుంది.
ఆండ్రాయిడ్ మొబైల్స్ లు సెట్టింగ్ మేనోకు వెళ్లి అక్కడ నెట్వర్క్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ లో నెట్వర్క్ బదులుగా మొబైల్ నెట్వర్క్ అనేది ఉంటుంది.
ఇక నెట్వర్క్ సెక్షన్ కి వెళ్ళిన తర్వాత వైఫై ప్రిఫరెన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.
వైఫై కాలింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి మీ ఫోన్లో రెండు సిమ్ కార్డులు ఉంటే వాటిలో మీకు ఇష్టమైన సిమ్ కార్డు నుంచి వైఫై ఫీచర్ను ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఆపరేటింగ్ సిస్టం బట్టి ప్రాసెస్ మారుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: