ఫేమస్ బైక్ కంపెనీ యమహా మూడు చక్రాలు కల్గిన సరికొత్త బైక్ ను విడుదల చేసింది. జపాన్ మార్కెట్ లో ప్రస్తుతం ఈ సూపర్ అప్డేటెడ్ బైక్ ఇప్పుడు అందుబాటులో ఉంది.అయితే ఇది ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లోకి రావాలంటే ఖచ్చితంగా కొంత కాలం పాటు వెయిట్ చేయాల్సిందే. సరికొత్త డిజైన్ తో ఆకర్షించే లుక్ ని ఈ బైక్ ని కంపెనీ డిజైన్ చేసింది.బైక్ మోడల్స్ లను ఎప్పటికప్పుడు సరికొత్తగా మార్చేందుకు యమహా కంపెనీ వినూత్నంగా ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది.అందులో భాగంగా ఈ సారి కూడా సరికొత్తగా మూడు చక్రాల వాహనాన్ని తీసుకువచ్చి వినియోగదారుల్ని ఎంతగానో ఆశ్చర్యపరచింది.దీని ముందు రెండు చక్రాలు వెనక ఒక చక్రాన్ని అమర్చి క్రేజీ లుక్ లో బైక్ ని తయారు చేసింది.దాదాపు స్పోర్ట్స్ బైక్ ని పోలినట్లు ఉండే ఈ న్యూ లుక్ బైక్ చూపరులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక గ్లోబల్ మార్కెట్ లో మంచి క్రేజ్ ఉన్న యమహా ప్రస్తుతానికి ఈ బైక్ ని జపాన్ దేశానికి మాత్రమే పరిమితం చేసింది.
125సీసీ, 155సీసీ ఇంకా 300సీసీలలో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది. 125, 155 సీసీలలో ఒకే లాగా ఇంజిన్ ని డిఫరెంట్ పవర్ లో యమహా కంపెనీ అందిస్తోంది. ఈ అప్డేటెడ్ ట్రైసిటి బైక్ లో లిక్విడ్ కూల్ ఇంజన్ ని కూడా యమహ కంపెనీ పొందుపరచింది.ఇక 125 సీసీ బైక్ 12.06 BHP వద్ద 11.02 NM టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 155సీసీ బైక్ 14.8BHP వద్ద 14NM టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు సీసీలలో కూడా R15 V4 ఇంజిన్ ని ఈ బైక్ కలిగి ఉంది. దాదాపు స్పోర్ట్స్ బైక్ కి ఉండే ఫీచర్లు ఈ ట్రైసిటికి యమహా కంపెనీ యాడ్ చేసింది.ఇక దీని భాగంలో అతిపెద్ద LED లైట్ ని ఈ బైక్ కి అమర్చారు. సీట్ ఇన్ సైడ్ లో ఛార్జింగ్ సెట్ ఇంకా లగేజ్ పొందుపర్చేందుకు ఎక్కువ ప్లేస్ ని కల్పించింది.ఇంకా అలాగే స్మార్ట్ ఫోన్ కనెక్టివిటితో పాటు కీలెస్ ఆపరేషన్ ని కూడా మనం ఈ బైక్ లో పొందవచ్చు. ఇంకా చాలా అధునాతన టెక్నాలజీని యమహా ఈ ట్రైసిటీ బైక్ లో అందిస్తోంది. ట్రైసిటీ 125సీసీ బైక్ ధర మన కరెన్సీలో సుమారు రూ. 3.1 లక్షలు ఇంకా అలాగే 155 సీసీ ధర సుమారు రూ.3.54 లక్షలు ఉండే ఛాన్స్ ఉంది.