ఇపుడు కూలర్ కంటే చవకైన ఏసీ మార్కెట్లోకి... ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు!

praveen
ఇలా ఎండాకాలం మొదలైందో లేదో... ఎండలు మండిపోతున్నాయి. మార్చ్ నెలలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో అయితే పరిస్థితి ఇక ఆ పరమేషుడికెరుక. అందుకే అవకాశం వున్నవారు ఈ సీజన్లో ఏసీల వైపు మొగ్గు చూపుతారు. ఇంకొందరు ఏసీకి బదులుగా కూలర్‌ని ఎంచుకుంటారు. కానీ, ఇప్పుడు కూలర్ కంటే చౌకగా లభించే ఏసీ ఒకటి మార్కెట్‌లోకి వచ్చింది. దీని ధర తక్కువగా ఉన్నప్పటికీ, అది ఇచ్చే చల్లదనం ఆహ్లాదకరంగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. కాగా ఈ ఏసీకి ఆన్‌లైన్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వినియోగదారులు కూడా ఈ ఏసీని పెద్దఎత్తున కొనుగోలు చేయడమే దానికి కారణం.
అవును, ఈ పోర్టబుల్ మినీ ఏసీని చాలా కంపెనీలు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రవేశపెట్టాయి. ఇక ఈ మినీ ఏసీలు రూ.2 వేల లోపు ధరకే లభిస్తుండడం విశేషం. అయితే ఆన్‌లైన్ మార్కెట్‌లో ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అవును, ఈ మినీ పోర్టబుల్ ఏసీని ఫ్లిప్‌కార్ట్‌లో ఇపుడు రూ. 1500కి అందుబాటులో కలదు. ఈ AC గదికి అనుగుణంగా రూపొందించబడింది. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఒక చోటు నుండి మరో చోటకు తీసుకువెళ్లడం చాలా తేలిక.
ఇకపోతే ఇది యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది అన్నమాట. మీరున్న గది లోకి ఎక్కడైనా దీన్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇది విద్యుత్తు తో నడిచేది మాత్రం కాదు. దీనికి USB కనెక్టర్ ఉంది. దీన్ని చాలా సులభంగా ల్యాప్‌ టాప్ లేదా కంప్యూటర్‌కి కనెక్ట్ చేసుకొనే వీలుంది. దానిని ఇంట్లోనే కాకుండా ఆఫీసు లో, ఆరు బయట ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇది త్వరగా గది వేడి ఉష్ణోగ్రతను సాధారణ స్థితిలోకి తీసుకు రాగలదు. ఇది గదిని వేగం గా చల్లబరుస్తుంది. మీరు ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ అయినటువంటి ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ నుండి సులభంగా కొనుగోలు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ac

సంబంధిత వార్తలు: