హ్యూందాయ్‌ అల్కాజర్‌ 2023: సూపర్ ఫీచర్స్?

హ్యూందాయ్‌ కంపెనీ తన సూపర్ SUV అల్కాజర్‌ ను టాటా సఫారీ, ఎంపీ హెక్టర్‌ ప్లస్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి మోడళ్లకు పోటీగా  లాంచ్‌ చేస్తోంది.హ్యూందాయ్‌ అల్కాజర్‌ లో మొత్తం 115లీటర్ల టర్భో పెట్రోల్‌ మోడల్‌ లో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అందులో భాగంగా ప్రెస్టేజ్, ప్లాటినం, ప్లాటినం ఓ, సిగ్నేచర్ ఓ వంటి నాలుగు వేరియంట్లలలో ఈ వెహికల్ అందుబాటులోకి వచ్చింది.వీటి ధరలను కనుక మీరు పరిశీలిస్తే.. అల్కాజర్ 7 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లో, 6ఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో ప్రెస్టేజ్ ఇంకా అలాగే ప్లాటినం ట్రిమ్స్ లభిస్తున్నాయి. ప్రెస్టేజ్ ట్రిమ్ ఎక్స్‌షోరూమ్ ధర వచ్చేసి రూ.16,74,900 కాగా, ప్లాటినం వేరియంట్ ధర వచ్చేసి రూ.18,65,100గా కంపెనీ నిర్ణయించింది. ఇంకా అలాగే 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లో 7డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో ప్లాటినం ఓ ఇంకా సిగ్నేచర్ ఓ ట్రిమ్స్ లభిస్తున్నాయి. ఇక వీటి ధరలు వరుసగా రూ.19,96,000, రూ.20,25,100గా ఉన్నాయి. ఇంకా అదే విధంగా అల్కాజర్ 6 సీటర్ కాన్ఫిగరేషన్‌లో 7డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో ప్లాటినం ఓ ఇంకా అలాగే సిగ్నేచర్ ఓ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


ఇక వాటి ధరలు వచ్చేసి వరుసగా రూ.19,96,000, రూ.20,25,100గా హ్యుందాయ్ కంపెనీ నిర్ణయించింది.ఈ హుందాయ్ అల్కాజర్ కారు 1.5 లీటర్‌ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.ఈ కార్ కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్స్‌తో లాంచ్ అయింది. అల్కాజర్‌ లోగోతో న్యూ ఫ్రంట్ గ్రిల్ డిజైన్ ఇంకా రీ డిజైన్ పుడ్ల్ ల్యాంప్ అప్‌గ్రేడ్ అయ్యాయి. ఈ ఎస్‌యూవీ కార్ అప్‌డేట్ వెర్షన్‌లో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.ఇందులో మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. ఫేస్‌లిఫ్ట్ స్టాక్ ఫిట్‌మెంట్‌గా ఐడిల్ స్టాప్ అండ్‌ గో ఫీచర్‌ కూడా ఈ కార్ లో ఉంటుంది. స్టాప్ అండ్‌ గో స్పెసిఫికేషన్ అనేది వివిధ డ్రైవింగ్ మోడ్స్‌తో ఇంధన సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ అల్కాజర్-2023 అప్‌గ్రేడ్ వెర్షన్ 1.5L టర్బో GDi పెట్రోల్ ఇంజన్‌తో వచ్చింది. రియల్ డ్రైవింగ్ ఉద్గారాల (RDE) నిబంధనలకు అనుగుణంగా కంపెనీ E20 ఫ్యూయల్ రెడీతో ఈ SUV కార్ ఇంజిన్‌ను అప్‌గ్రేడ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: