బుల్లి పిట్ట: ఫ్రంట్ డ్యూయల్ కెమెరాతో.. అదిరిపోయే MI మొబైల్..!!

Divya
ఇండియాలో పెరిగిన స్మార్ట్ ఫోన్ వినియోగం నేపథ్యంలో పలు కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ మొబైల్స్ ని తీసుకువస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో విడుదలైన ఏ మొబైల్ అయినా సరే కెమెరాలన్నీ కూడా ఒకే రకంగా కనిపిస్తూ ఉన్నాయి. మొబైల్ ధర అనుగుణంగా డ్యూయల్ త్రిబుల్ కెమెరా సెట్ అప్ తో వస్తూ ఉన్నాయి. అయితే ఫ్రంట్ కెమెరా మాత్రం ధరణిబట్టి ఒకే కెమెరాతో లభిస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ మొబైల్ తయారీ సంస్థ..MI డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెట్ అప్ తో ఒకసారి కొత్త మొబైల్ ని విడుదల చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.

MI CV పేరుతో ఈ మొబైల్ ని విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ మొబైల్ కంపెనీ ఈ నెలలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ కేవలం మూడు కలర్లలోనే అందుబాటులో ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ ను ఎంఐ సంస్థ విడుదల చేస్తోంది అంటూ టెక్నిపుణులు తెలియజేస్తున్నారు తాజాగా ఈ మొబైల్ గురించి కొన్ని లీక్స్ వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.

MI CV -3:
ఈ పేరుతో ఈ మొబైల్ ప్రస్తుతం చైనా లోట్ లాంచ్ కాబోతోంది.. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.5 అంగుళాల ఎల్ఈడి డిస్ప్లే కలదు. అలాగే 12GB+256 స్టోరేజ్ వేరియంట్లలో ఈ మొబైల్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే. 4500 MAH సామర్థ్యం తో పాటు 67 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలదు. బ్యాక్ కెమెరా 50MP 20 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా 2 ఎంపీ మాక్రో  తో కలదు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 +32 డ్యూయల్ కెమెరా కలదు. ఇక ఇన్సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివి కలవు. చైనాలో ఈ మొబైల్ ఈరోజు లాంచ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: