వావ్.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?
చంద్రునిపై పరిశోధనలు చేపట్టడానికి తమ వ్యోమగాములను చంద్రుని పైకి పంపబోతున్నట్లుగా చెప్తుంది చైనా. అంతరిక్ష ప్రయోగాలను ముందుకు తీసుకు వెళ్లడానికి చైనా తన సొంత అంతరిక్ష ప్రయోగశాలకు మూడవ విడత ప్రయోగంలో భాగంగా ముగ్గురు వ్యక్తులను పంపించింది. జిమ్ హైపింగ్, జి యాంగ్ జ్యూ అనే ఇద్దరు వ్యోమగాముల తో పాటు పౌర వ్యోమగామి గుయ్ హైవ చావో వీళ్ళందర్నీ ఐదు నెలలు అక్కడ ఉండమన్నారు అని తెలుస్తుంది.
వీళ్లు వెళ్ళబోయే షంజావో 16 వ్యోమ నౌకను ప్రయోగించడానికి ఇన్నర్ మంగోలియా లోని జూకర్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం వద్ద ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు చైనా అంతరిక్షంలోకి పంపించిన వ్యోమగాములందరూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యోమగాములేనని, కేవలం గుయ్ మాత్రమే పౌర వ్యోమగామి అని తెలుస్తుంది.
ఈ సందర్భంగా మానవ సహిత అంతరిక్ష సంస్థ డిప్యూటీ డైరెక్టర్ లింజిత్ యాంగ్ మాట్లాడుతూ ఇటీవల చైనా మానవ సహిత చంద్ర మండల అన్వేషణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 2030 కల్లా మనిషిని చందమామ పైకి పంపించడం ఇంకా అక్కడ ప్రయోగాలు, పరిశోధనలు జరపడం అనేవి జరిగేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా చందమామ పైకి వ్యోమగాములను పంపించడం ద్వారా, ఆ రకంగా ప్రయోగాలు, పరిశోధనలు జరపడం ద్వారా చందమామపై వాతావరణాన్ని కనుక్కుంటామని అంటున్నారు. చందమామపై నివాసాలే తమ ధ్యేయమని అంటున్నారట ఇప్పుడు చైనా వాళ్లు.