చాలా ప్రయోజనాలు కలిగిన కూలర్లతో వినియోగదారులు కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది. వీటిలో తరచుగా నీళ్లు నింపటం, సరైన స్థలంలో ఉంచకపోతే తేమ ఇంకా ఎక్కువ శబ్దంతో విసుగు పుట్టిస్తుంది. మరికొన్ని సార్లు కూలర్లలోని నీళ్లు చేపల వాసనతో విపరీతమైన కంపుకొడుతుంటాయి.అయితే,ఎయిర్ కూలర్ వాసనను ఎలా వదిలించుకోవాలో తెలియక చాలా మంది కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. అందుకోసం మార్కెట్లో లభించే కూలర్ స్మెల్ రిమూవర్ వంటి వాటి కోసం ఎక్కువ డబ్బు ఖర్చుపెడుతుంటారు. అయితే అలాంటి పరిస్థితిలో ఎటువంటి శ్రమ, డబ్బు ఖర్చు లేకుండా కూలర్ మంచి వాసన కలిగించే మార్గాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దాంతో మీరు ఈ సీజన్ అంతా సువాసనతో కూడిన చల్లదనాన్ని ఆస్వాదించగలుగుతారు.కూలర్ వాసన రావడానికి అతిపెద్ద కారణం ఏంటంటే దాని శుభ్రపరచడంలో నిర్లక్ష్యం.మీరు ప్రతి వారం కూలర్లో నీటిని పూర్తిగా తీసేసి శుభ్రం కనుక చేయకపోతే అప్పుడు కుళ్ళిన వాసన ప్రారంభమవుతుంది. అలాగే బయట దుమ్ము, తేమ కారణంగా కూలర్ వాసన రావటం మొదలవుతుంది. దీంతో పాటు రెగ్యులర్ క్లీనింగ్ లేకపోవడం వల్ల కీటకాలు కూడా దానిలో పెరగడం స్టార్ట్ అయ్యిద్ది. దాంతో కూలర్లో నీరు అంతా కుళ్ళిపోయేలా చేస్తుంది. ఇంకా ఇదీ కాకుండా, కూలర్‌లోని గడ్డి అలాగే కూలింగ్ ప్యాడ్లోని అచ్చు నుండి కూడా దుర్వాసన వస్తుంది.
కూలర్లో దుర్వాసన ఇంకా బ్యాక్టీరియా రెండింటినీ తొలగించడంలో వేప ఆకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇందుకోసం గాను ఆకులను తీసుకుని కాటన్ గుడ్డలో కట్టాలి. ఈ వస్త్రం చాలా సాఫ్ట్ గా ఉండాలి. తరువాత ఇలా తయారు చేసిన వేప ఆకుల మూటను కూలర్ నీటిలో ఉంచాలి. ఇక ఇలా చేయడం వల్ల నీరు వాసన పట్టదు. అలాగే క్రిమికీటకాలు కూడా వృద్ధి చెందవు.అయితే మీరు ప్రతి 3-4 రోజులకు ఒకసారి వేప ఆకులను మార్చాలి.ఇంకా అలాగే నారింజ తొక్కతో కూడా మీ కూలర్‌ను సువాసన వచ్చేలా మార్చుకోవచ్చు. మీరు సాధారణంగా డస్ట్‌బిన్‌లో విసిరే నారింజ తొక్క నిజానికి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. కూలర్ లోంచి వచ్చే దుర్వాసననుఈజీగా తొలగించడానికి కూడా నారింజ తొక్క చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం నారింజ తొక్కను ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. ఇక మీరు దీనికి కాస్త దాల్చిన చెక్కను కూడా కలుపుకోవచ్చు. తరువాత ఈ మిశ్రమాన్ని కూలర్ నీటిలో కొద్ది మొత్తంలో చల్లుకోవాలి.