బుల్లి పిట్ట: జియో నుంచి 5G మొబైల్.. ..!!
గూగుల్ తో కలిసి జియో ఫైవ్ జి మొబైల్ ని డెవలప్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.2021 లో గూగుల్ భాగస్వామితో కలిసి అందరికీ అందుబాటులో విధంగా కేవలం 4g మొబైల్స్ ని గతంలో తీసుకురావడం జరిగింది. గూగుల్ భాగస్వామితో వస్తున్న జియో 5జి మొబైల్ డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో లభిస్తున్నట్లుగా కనిపిస్తోంది బ్యాక్ సైడ్ కెమెరా 13 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు 2 మెగా ఫిక్స్ఎల్ సెన్సార్ కెమెరా వాటర్ డ్రాప్ నాచ్ విత్ 5 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది.
జియో 5జి మొబైల్ ధర రూ.8000-10000 లోపు ఉండొచ్చని సమాచారం.. 4g రామ్ + 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో రాబోతున్నట్లు లీక్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే..6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో పాటు..5000 MAH బ్యాటరీ సామర్థ్యం తో కలదు అలాగే 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది ఈ మొబైల్ వచ్చే దీపావళి పండుగకు రిలయన్స్ జియో మొబైల్ ని ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. మరి ఎందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన త్వరలోనే వెలుపడుతుందేమో చూడాలి మరి.