బుల్లి పిట్ట: వాట్సాప్ నుంచి గుర్తు తెలియని కాల్స్ ఇలా మ్యూట్ చేయండి..!!
వాట్సప్ లో గుర్తుతెలియని కాంటాక్ట్ ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్లను మ్యూట్ చేసే విధంగా యూజర్లకు వాట్సప్ సరికొత్త అప్డేట్ను తీసుకువచ్చింది.. అయితే ఈ అప్డేట్ ను ఆండ్రాయిడ్,IOS రెండిటిలో కూడా మొబైల్ యాప్స్ లలో అందుబాటులో తీసుకువచ్చింది. ఇలా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. గత వారంలో META CEO మార్క్ జుకర్ బర్గ్ వాట్సప్ యూజర్లకు గుర్తుతెలియని కాంటాక్ట్ ల నుంచి వచ్చి ఇన్కమింగ్ కావాల్సిన సైతం సైలెంట్లో ఉండేవిధంగా సరికొత్త ఫీచర్స్ ప్రకటించారు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఇలా రెండిట్లో కూడా స్టేబుల్ వర్షన్లో అందుబాటులో ఉన్నది.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చాయంటే రింగ్ శబ్దం వినపడకుండా సైలెంట్ లోనే ఉంటుంది.. అయితే అందుకోసం ఒక చిన్న సెట్టింగ్ ని మార్చుకోవాల్సి ఉంటుంది..
1). ముందుగా మా స్మార్ట్ మొబైల్ లో వాట్సాప్ ఓపెన్ చేయాలి.
2). అలా ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్ కు వెళ్ళి privacy ఆప్షన్ను ఎంచుకోవాలి.
3).privacy ఆప్షన్ లో calls ట్యాబును ఎంచుకోవడం జరుగుతుంది.
4). అక్కడ సైలెన్స్ అన్నోన్ కాల్స్ ట్యాగ్ను ఎనేబుల్ చేయాలి.
ఆండ్రాయిడ్ ఫ్యూచర్లు డాట్ ఎంపిక పైన క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్ ని యాక్సిస్ చేసుకోవచ్చు.. ఐఫోన్ వినియోగదారులు సెట్టింగ్ గేర్ ఐకాన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.. ఆ తర్వాత silence unknown calls కోసం టోగుల్ ను నిలిపివేయవచ్చు.