ప్రపంచంలోనే చౌకైన కారు.. టైర్లు లేకుండానే దూసుకుపోతుంది?

praveen
ఇంట్లో కారు ఉంటే ఎంత బాగుంటుంది.. బస్సు ట్రైన్ కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సరదాగా బయటికి వెళ్లి రావచ్చు. అయితే ఫ్యామిలీ అందరూ కలిసి ఏదైనా టూర్ కి కూడా వెళ్ళిరావచ్చు అని ఎంతో మంది మధ్యతరగతి ప్రజలు కోరుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి కారు కొనడం అనేది సాధ్యపడదు. ఇటీవల కాలంలో అటు కారు ధరలు అంతకంతకు పెరిగిపోతున్నాయ్. దీంతో సామాన్యుడికి కారు కొనాలి అనేది కలగానే మిగిలిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు వస్తే బాగుండు అని ఎంతమంది కోరుకుంటూ ఉంటారు.

 ఇకపోతే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ కారు చూడడానికి అసలు కారు లాగే లేదు. కానీ ఇది రోడ్డు మీద దూసుకుపోతుంది. ప్రత్యేకమైన డిజైన్ తో ప్రత్యేకమైన లక్షణాలతో తయారైన ఈ కారు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా  ఈ కారు లేకుండా ముందుకు వెళ్లడానికి అసలు టైర్లే లేవంటే నమ్మండి. టైర్లు లేకపోయినప్పటికీ చదునైన రహదారిపై దానికదే కదులుతుంది ఈ కారు. దీంతో ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 అంతేకాదు ఎన్నో దిగ్గజ కారు కంపెనీలు కూడా మరోసారి ఆలోచనలో పడిపోయే విధంగా ఈ వినూత్నమైన ఆవిష్కరణ ఉంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన ఈ వీడియోలో చూసి నోరు తెరిచి కన్నారపుకుండా చూసేస్తున్నారు అందరూ. 9 సెకండ్ల నిడివి గలిగిన ఈ వీడియోలో రోడ్డుపై కారు కదులుతుండగా.. చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఇటాలియన్ ఆటోమొబైల్ ఇన్ఫ్లుయెన్సర్ ఈ కారును తయారు చేశారు. అయితే ధ్వంసమైన పాత కారును ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారును తయారు చేశాడు సదరు వ్యక్తి. ఇక ఈ కారుకు ఒక కెమెరా కూడా అమర్చాడు.  దీంతో ఈ కారు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా అడ్డంకులు ఉంటే అది ముందుగానే కనిపెట్టేందుకు వీలుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: