చాట్ జీపీటీ టీచర్ కూడా వచ్చేసింది.. కొత్త ప్రయోగం సక్సెస్?
అయితే చాట్ జీపీటీ రాకతో విద్యా రంగం లో కీలక మార్పులు వస్తున్నాయి. ఛాట్ జీపీటీ, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహయం తో హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. కంప్యూటర్ సైన్స్ విభాగం లో కంప్యూటర్ సైన్స్ పరిచయం కోర్సుతో ఏఐ ఛాట్‌బాట్ ని అను సంధానం చేయాలని చూస్తోంది. సెప్టెంబర్ లో ఈ టూల్ ని వినియోగం లోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇది అందుబాటు లోకి వస్తే చాట్ జీపీటీనే టీచర్ గా మారి పాఠాలు బోధించనుంది.
జీపీటీ 3.5, 4 మోడళ్ల లో ఈ చాట్ బాట్‌ను తయారుచేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించడం తో పాటు సందేహాలు, సమస్యలను అప్పటికప్పుడు తీర్చుతుంది. విద్యార్థులకు 24 గంటలు సహాయ పడేలా ఈ టూల్ ని తయారు చేశారు. ప్రతి విద్యార్థికి ఒక టీచర్ ఉండాలనే లక్ష్యం తో దీనినని తెచ్చినట్లు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్రిమ్సన్ తెలిపారు. అయితే వీటి వినియోగం పెరిగితే ఇక ఉపాధ్యాయుల పని ఉండదని, వారి ఉద్యోగాలు ప్రమాదం లో పడతాయని అంటున్నారు. దీంతో రానున్న కాలం లో ఈ ఏఐ టూల్స్ వల్ల టీచర్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. మరి రానున్న కాలంలో ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తాయనేది వేచి చూడాలి.