బుల్లి పిట్ట: రెండు రోజుల బ్యాకప్ తో సరికొత్త శాంసంగ్ M-34 ..5G మొబైల్..!!
సాంసంగ్ గెలాక్సీ..M-34 ..5G:
ఈ స్మార్ట్ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 6000 MAH సామర్థ్యంతో కలదు. అలాగే 25 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుందట. ఈ మొబైల్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 13 బెస్ట్ ఓన్ యుఐ -5 వర్షన్ తో పనిచేస్తుందట.6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో కలిగి ఉంటుంది కెమెరా విషయానికి..50 మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెట్ అప్ కలదు.
ఈ మొబైల్ బ్లూ సిల్వర్ కలర్ లో మాత్రమే లభిస్తుందట. ఈ స్మార్ట్ మొబైల్ కి నాలుగేళ్ల పాటు ఓఎస్ అప్డేట్ తో పాటు ఐదేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్ కూడా ఇస్తుందట అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా ఈనెల 15 నుంచి అమెజాన్ తో పాటు ఇతర వెబ్సైట్లో కూడా కస్టమర్లు ఈ మొబైల్ ని తీసుకునేందుకు అందుబాటులో కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 12 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరా కలదు బ్యాక్ సైడ్ 120 డిగ్రీ ఫీల్డ్ సెటప్ కెమెరా కలదట. అలాగే 5g వైఫై బ్లూటూత్ తదితర టెక్నాలజీ ఫీచర్స్ తో ఈ మొబైల్ కస్టమర్ల కోసమే తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.