బుల్లి పిట్ట: దోమలను తరిమికొట్టే యాప్..!!
కేవలం ఎలాంటి పని చేయకుండా దోమలను తరిమికొట్టేందుకు ఒక గార్డెన్ అందుబాటులోకి ఉన్నది. ఈ రోజుల్లో స్మార్ట్ మొబైల్ లో కూడా ఇటువంటి అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్లో వివిధ యాప్స్ అందుబాటులో కలవు. ఇలాంటివన్నీ దోమలను తరిమికొట్టేందుకు చాలా రకంగా సహాయపడతాయి.. మస్కిటో కిల్లర్, మస్కిటో సౌండ్ తదితర యాప్స్ ప్లే స్టోర్ లో మనం చూడవచ్చు. ఈ యాప్స్ లో విభిన్నమైన ఫ్రీక్వెన్సీ సౌండ్ ని ఉత్పత్తి చేసి ఈ సౌండ్ వల్ల దోమలను ఇంటిలో నుంచి తరిమికొట్టేలా సహాయపడతాయట.
ఈ శబ్దం వల్ల మానవులకు వినపడనంత తక్కువగా ఉంటుందట. కానీ డెవలపర్లు ఇది దోమలకు మాత్రం వినపడేలా డెవలప్మెంట్ చేసినట్లు తెలుస్తోంది.ఈ యాప్ ను చాలా మంది ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ ను ఉపయోగించే విధానాలు రేటింగ్ కూడా చాలా వైవిధ్యంగా ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. దోమలతో విసిగిపోయి ఉన్నవారు మాత్రం ఈ యాప్ చాలా సౌకర్యంగా ఉపయోగపడుతుందని చెప్ప వచ్చు. అయితే ఈ యాప్ ను ఉపయోగించడం వల్ల కొంతమేరకు మంచి ఫలితం పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.