బుల్లి పిట్ట: వాషింగ్ మిషన్ పేలకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ పాటిస్తే సరి..!!
ఇటీవల ప్రముఖ నగరాలలో ఒక మహిళ వాషింగ్ మిషన్ వినియోగిస్తున్న సమయంలో షాక్కు గురై ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగిందట.. అయితే వాషింగ్ మిషన్ వినియోగిస్తున్న సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని విషయం పై కొంతమంది నిపుణులు పలు రకాల సూచనలు సూచిస్తున్నారు. నిపుణులు తెలుపుతున్న ప్రకారం వాషింగ్ మిషన్ ఉపయోగించుకోవడం చాలా సులభం కానీ కొన్నిసార్లు వాషింగ్ మిషన్ ను ఉపయోగిస్తున్నప్పుడు అతి జాగ్రత్తగా ఉండడం ప్రాణంతకం కావచ్చు అంటూ తెలిపారు.
ఫ్రిజ్జులు, వాషింగ్ మిషన్లు వంటివి రిపేర్లు వంటివి రిపేర్లు వచ్చినప్పుడు టెక్నీషియన్లతోని రిపేర్ చేయించడం చాలా మంచిది ఏదైనా వైర్లు అనుమానస్పదంగా తెగినట్లు కనిపించిన అవి కనిపించకుండా టేపుతో చుట్టిన తర్వాత టెక్నీషియన్ పిలిపించి బాగు చేయించుకోవడం మంచిది. ప్రతిరోజు కూడా వాషింగ్ మిషన్ వైర్లను చెక్ చేస్తూ ఉండాలి.
వాషింగ్ మిషన్ ఉపయోగిస్తున్నప్పుడు మీరు నియంత్రణ ప్యానల్ పైన పడకుండా ఉండేలా చూసుకోవాలి యంత్రాన్ని నియంత్రించే బటనపై నీళ్లు పడ్డట్టుయితే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.
వాషింగ్ మిషన్ లోపల మోటార్స్ స్క్రూలు అప్పుడప్పుడు లూజ్ అవుతూ ఉంటాయి వాటిని మర్చిపోకుండా టైట్ చేస్తూ ఉండాలి.. వాషింగ్ మిషన్ ను క్రమం తప్పకుండా సర్వీసింగ్ లాంటివీ చేయించడం మంచిది.
వాషింగ్ మిషన్ లో అధికంగా ప్రెజర్ పెట్టడం వల్ల కూడా మోటార్ హీటెక్కి పేలే అవకాశం ఉంటుంది అందుచేతనే వారు ఇచ్చిన సూచన మేరకే బట్టలు లోపల వేయాలి.