బుల్లి పిట్ట: సరికొత్త ఫిచర్స్ తో సర్ ప్రైజ్ చేసిన వాట్సాప్..!!
ఇదే క్రమంలోనే ఇప్పుడు మరొక అద్భుతమైన ఫీచర్ ను సైతం ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు కస్టమర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్స్ ను తీసుకువస్తోంది. మెసేజ్ లాగే షార్ట్ వీడియోస్ లను కూడా ఇప్పుడు పంపించవచ్చు.. దాదాపుగా 60 సెకండ్ల నిడివి తో ఉన్న ఆ షార్ట్ వీడియోను మనం పంపవచ్చట.. ఈ వాట్సప్ కొత్త అప్డేట్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ ప్రకటించడం జరిగింది. వీడియో మెసేజ్ చాటులకు ప్రతిస్పందించడానికి సైతం ఇది రియల్ టైం వాయిస్ అని కూడా తెలుపవచ్చు.
మనం ఏదైనా చెప్పి సందేశాన్ని పంపించాలి అనుకుంటే 60 సెకండ్లలో దానిని వివరించవచ్చు ఎవరైనా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన లేదా ఏదైనా శుభవార్త అందించిన వీడియో నుంచి వచ్చే అన్ని బాగోద్వేగాలతో క్షణాలను పంచుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఈ కొత్త ఇన్స్టంట్ వీడియోలు వాయిస్ మెసేజ్ లాగానే ఉంటాయట కానీ వీడియోతో ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇది ఇప్పటికే జులై 27 నుంచి అందుబాటులో ఉన్నది. అయితే ప్లే స్టోర్ లో వాట్సాప్ ని అప్డేట్ చేసుకోవాలని ఆ సంస్థ తెలియజేస్తోంది. ప్రస్తుతం వినియోగదారులు వాట్సాప్ ని అధికంగా ఉపయోగించుకుంటున్నారని చెప్పవచ్చు.